కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూ తెలంగాణ పాలిటిక్స్‌లో ఎలాంటి ప్రకంపనలు రేగుతున్నాయో... ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అదంతా ప్రాజెక్ట్ నిర్మాణం చుట్టూ జరుగుతున్న రచ్చ. ఫ్రంట్ పోర్షన్‌లో ఆ స్థాయి రచ్చ జరుగుతుంటే... బ్యాక్‌లో కూడా ఆ స్థాయి కాకున్నా... దాదాపు అలాంటి గొడవే జరుగుతోంది. అక్కడ కూడా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రాజకీయ లబ్దికోసం పావులు కదుపుతూ పరస్పరం టార్గెట్ చేసుకుంటున్నాయి.
లక్కీ భాస్కర్ మూవీలో హీరో బ్యాంక్ క్యాషియర్‌గా పని చేస్తుంటాడు. చాలీ చాలని జీతంతో, అప్పులతో జీవితం గడుపుతుంటాడు. బ్యాంక్‌లో ఎంత కష్టపడినా ప్రశంసలు వస్తాయి తప్ప ప్రమోషన్ రాదు. ఈ క్రమంలో హీరో బ్యాంకులోని డబ్బును కాజేసి గూడ్స్ స్మగ్లింగ్ చేస్తాడు. దీంతో అవసరాలకు సరిపడా డబ్బు వస్తుంది. ఇక్కడ కూడా ఎస్బీఐ బ్యాంక్ క్యాషియర్ లక్కీ భాస్కర్ లాగ మారి రూ. 80 లక్షల నగదు, రూ. 2 కోట్లు విలువ చేసే గోల్డ్…
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఉదయం సినిమా థియేటర్ పై రాళ్లతో దాడి చేసిన వారిపై కేసు నమోదు అయింది. పుష్ప సినిమా వేయకపోవడంతో రాళ్ళతో థియేటర్ పై దాడి చేశారు అభిమానులు. బజ్జూర్ వినయ్ తో పాటు అతని అనుచరులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు పోలీసులు. 04న చెన్నూరుకు చెందిన బజ్జూరి వినయ్, కొంతమంది తన అనుచరులతో కలిసి చెన్నూరులోని శ్రీనివాస థియేటర్ ప్రోప్రైటర్ అయిన కుర్మ రాజమల్ల గౌడ్ వద్దకు వెళ్లి పుష్ప-2…
మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ ఎమ్మెల్యేలు అభివృద్ధి వైపు దృష్టి పెడుతుండగా... అనుచరగణం మాత్రం చెలరేగుతోందని, కొంతమంది వ్యవహార శైలి వల్ల జనంలో నెగెటివ్ రిమార్క్స్ పడుతున్నాయని అంటున్నారు. ఇటీవల చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్... తన గెలుపులో కీలక పాత్ర పోషించిన ఓనేతను దూరం పెట్టినట్టు సమాచారం
Chennur: రాష్ట్రంలో ఎంతో ఆసక్తి రేపిన చెన్నూర్ నియోజవర్గంలో కాంగ్రెస్ విజయం దిశగా దూసుకుపోతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వెనుకంజలో ఉన్నారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేస్తున్న వివేక్ వెంటకస్వామి భారీ ఆధిక్యతను కనబరుస్తున్నారు. కనుచూపు మేరలో కూడా బాల్క సుమన్ కనిపించడం లేదు.
దమ్ముంటే అభివృద్ధి పైన మాట్లాడు.. లేదా బహిరంగ చర్చకు దా.. వివేక్ కి అతనిపై అతనికే నమ్మకం లేదు.. అంగీలు మార్చినంత ఈజీగా పార్టీలు మారితే జనం ఎలా నమ్మతారు.. వివేక్ ఖచ్చితంగా ఓడి పోతారు.. అభివృద్ధిపై చర్చకు నేను సిద్ధం అంటూ వివేక్ వెంకటస్వామికి బాల్క సుమన్ సవాల్ విసిరారు.
Nallala Odelu Comments on Balka Suman: చెన్నూర్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ అభ్యర్థి బాల్క సుమన్‌పై మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత నల్లాల ఓదెలు సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం మీడియా సమావేశంలో పాల్గొ ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. బాల్క సుమన్ తనని కొనేందుకు చూశాడంటూ షాకింగ్ విషయం చెప్పారు. ఇందుకోసం తనకు రూ. 20 కోట్లు ఆఫర్ చేసినట్టు తెలిపారు. బాల్క సుమన్‌కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే తనని కొనాలని చూసినట్టు పేర్కొన్నారు.…
చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని మందమర్రిలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ గడ్డ చైతన్య వంతమైనదని, ఓటు విచక్షణతో వేయాలని ప్రజలను ముఖ్యమంత్రి కోరారు.
దుర్గం చిన్నయ్య. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే. సింగరేణి పట్టాల పంపిణీ ఆయనకు నిద్ర లేకుండా చేస్తోందట. ఈ అంశంలో ఇన్నాళ్లూ అదిగో ఇదిగో అని ప్రచారం ఊదరగొట్టింది ఆయనే. జిల్లాలోని మిగిలిన రెండు నియోజకవర్గాల్లో అక్కడి శాసనసభ్యులు పట్టాల పంపిణీ జోరు పెంచితే.. బెల్లంపల్లిలో ఎక్కడో బెడిసి కొట్టిందట. అందుకే తెగ ఆందోళన చెందుతున్నారట ఎమ్మెల్యే చిన్నయ్య. సింగరేణిలో పనిచేసి అక్కడే తమ నివాసం ఏర్పాటు చేసుకున్న రిటైర్డ్ కార్మికులు.. స్థానికులకు సైతం పట్టాలు అందజేస్తున్నారు.…