Off The Record: ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు అనుచరులే తలనొప్పిగా మారుతున్నారా?
- మంచిర్యాల జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలకు తలనొప్పులు..
- అక్రమ బియ్యం.. లిక్కర్.. బూ దందాల్లో అనుచరులు బిజీ?..
- మంచిర్యాల.. బెల్లంపల్లి.. చెన్నూర్‌లో ట్రబుల్స్..
- చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ ఓ కీలక నేతను దూరం పెట్టారా?..
- నా పేరు వాడవద్దంటూ బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొందరు ఎమ్మెల్యేల అనుచరులు రెచ్చిపోతున్నారట. పోలీస్ స్టేషన్స్‌లో సెటిల్ మెంట్స్ మొదలు అన్ని రకాల వ్యవహారాల్లో వేళ్ళు పెట్టి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. మా సార్ పదవిలోకొచ్చారు అంటూ… పట్టపగ్గాల్లేకుండా వ్యవహరిస్తుండటంతో… ఇక ఆండ్రా బాబూ… మీ దందాలు అంటూ స్వయంగా ఎమ్మెల్యేలే వార్నింగ్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తోందంటున్నారు. మరీ ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలకు ఈ తలనొప్పులు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఓనేత ప్రధాన అనుచరుడు సెటిల్ మెంట్లు, ఇల్లీగల్ వ్యవహారాలకు రేటు ఫిక్స్ చేశారన్న ఆరోపణలున్నాయి. ఇక మరో ఎమ్మెల్యే అనుచరుడు అక్రమ బియ్యం, లిక్కర్, భూ దందాతోపాటు సరిహద్దు ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాలో సైతం ఊతమిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక మరో ఎమ్మెల్యే అనుచరులపై అరాచకాల గురించి అయితే.. అస్సలు చెప్పే పనే లేదంటున్నారు. చివరికి సదరు ఎమ్మెల్యేనే వాళ్ళని పిలిచి పేరు బద్నాం చేయకండర్రా అని బతిమాలుకోవాల్సి వస్తోందట.
Read Also: Amaravati: అమరావతి అభివృద్ధి.. ఈ ఏడాది చివరకల్లా రూ.15 వేల కోట్ల రుణం..
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ ఎమ్మెల్యేలు అభివృద్ధి వైపు దృష్టి పెడుతుండగా… అనుచరగణం మాత్రం చెలరేగుతోందని, కొంతమంది వ్యవహార శైలి వల్ల జనంలో నెగెటివ్ రిమార్క్స్ పడుతున్నాయని అంటున్నారు. ఇటీవల చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్… తన గెలుపులో కీలక పాత్ర పోషించిన ఓనేతను దూరం పెట్టినట్టు సమాచారం. గతంలో బీఆర్ఎస్ నేతకు ప్రధాన అనుచరుడిగా ఉండి మొన్నటి ఎన్నికల్లో వివేక్ కోసం పనిచేసిన ఆ నాయకుడు తక్కువ టైంలోనే చెడ్డపేరు తెచ్చుకోవడంతో… వివేక్ బహిరంగంగానే… నాపేరు చెప్పి దందాలు చేస్తే ఊరుకోబోనని వార్నింగ్ ఇచ్చారట. ఇక బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సైతం ఇలాంటి వ్యవహారాలతో ఇబ్బంది పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. గల్లీ నాయకులు సైతం పెద్ద లీడర్లలా ఫోజులు కొడుతూ ఎమ్మెల్యే పేరును బజారున పడేస్తున్నారన్నది బెల్లంపల్లి టాక్. చివరికి మావోయిస్టుల పేరుతో విడుదలైన లేఖలో సైతం చోటామోటా నాయకుల దందాల గురించి ప్రస్తావించారంటే… వాళ్ళ అరాటకాలు ఏ స్థాయికి చేరాయో అర్ధం చేసుకోవచ్చంటున్నారు స్థానికులు. వీటన్నిటినీ చూసి భరించలేని ఎమ్మెల్యే… వాళ్ళని పిలిచి ఒరే నాయనా…నాకు చెడ్డపేరు తేకండిరా…పనులు చేసుకోండిగానీ… పరువు తీయకండంటూ కాస్త బతిమాలడం, ఒకింత బెదిరించడం లాంటి రకరకాల విన్యాసాలు చేయాల్సి వచ్చిందట.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
ఇక అటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు పేరు చెప్పి కొంతమంది పెద్దపెద్ద డీల్స్ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమంగా భూముల రిజిస్ట్రేషన్లు, సెల్లార్ల కూల్చివేతలు, వరుసగా జిల్లా కేంద్రంలో జరగుతున్న దాడుల్లో ఎమ్మెల్యే అనుచరులు ఒక్కరిద్దరి పాత్ర ఉందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. అలాంటి వాళ్ళకు ఎమ్మెల్యే డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వడంతో పాటు….తోకజాడించి చెడ్డపేరు తెచ్చిన వారిని దూరంగా పెట్టారనే ప్రచారం సైతం జరుగుతోంది. మంచిర్యాల ఎమ్మెల్యే అనుచరులు కొందరు అతిగా తాగి అరాచకాలు చేస్తున్నారంటూ… ఎక్కువగా మందు కొట్టనంటూ ఏకంగా వాళ్ళతో ప్రమాణాలు కూడా చేయించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మండలానికి ఒక్కరో ఇద్దరో చేసే చెడుపనుల వల్ల ఎమ్మెల్యేల పదవులకు, అంతిమంగా కాంగ్రెస్‌కు నష్టం జరుగుతోందన్న బాధ ఆ పార్టీ వర్గాల్లో ఉందట. ఇలా ముగ్గురు ఎమ్మెల్యేలకు అనుచరుల ఆగడాలతో తలబొప్పి కడుతోందన్నది లోకల్ టాక్. వీళ్ళ వ్యవహారం చూస్తున్నవాళ్ళంతా… చాదస్తపు మొగుడు చెబితే వినడు, తిడితే ఏడుస్తాడన్నట్టుగా ఉందని కామెంట్స్ చేస్తున్నారట. ముగ్గురు శాసనసభ్యులు అనుచరుల్ని ఎలా కట్టడి చేస్తారో చూడాలి మరి.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!