కోడలిని అత్తారింట్లో కన్నతండ్రిలా చూసుకోవాల్సిన మామ బరితెగించాడు. సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించాడు. దీంతో విసుగుచెందిన కోడలు మామకి బాగా బుద్ధి చెప్పింది. వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం చెన్నూర్ లో దారుణం జరిగింది. కోడలిని లైంగికంగా వేధిస్తున్న మామ రాములు ఉదంతం వెలుగులోకి వచ్చింది. కోడలు చంద్రకళ మామ దాష్టీకాన్ని నిలదీసింది. అపరకాళిలా మారింది. మామను చితకబాదింది. దీంతో తీవ్రంగా గాయపడ్డాడా మామ. గాయపడిన మామను ఆసుపత్రికి తరలిస్తుండగా మామ మృతిచెందాడు. ఆలస్యంగా వెలుగులోకి…
మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో విద్యుత్ అధికారుల పై మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్లు వీరంగం చేశారు. సబ్ స్టేషన్ ఆవరణలో షెడ్ల నిర్మాణానికి మున్సిపల్ ఆధ్వర్యంలో భూమి పూజ చేస్తున్న క్రమంలో తమకు సమాచారం లేకుండా పనులు ఎలా చేస్తారని ప్రశ్నించిన విద్యుత్ అధికారుల పై వార్డు కౌన్సిలర్ లు రెవెళ్లి మహేష్,వేల్పుల సుధాకర్, జగన్నాథుల శ్రీనివాస్, పెండ్యాల లక్ష్మణ్ అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతూ దాడిచేశారని విద్యుత్ అధికారులు తెలిపారు. తమ ఉద్యోగులు పాషా, సృజన్ పై…
కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో నష్టపోతున్నామని చెన్నూర్ నియోజకవర్గ రైతులు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ నిరసనలో పెద్దపల్లి మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘కాంట్రాక్టుల పేరుతో దోచుకునేందుకు రీడిజైన్ చేపట్టారని.. రీడిజైన్ పేరుతో కోట్లు వృథా చేస్తున్నారన్నారు. ఢిల్లీలో కేసీఆర్ ఇల్లు తుగ్లక్ రోడ్డులో ఉంటుంది, అందుకే కేసీఆర్ తుగ్లక్ పాలన చేస్తున్నారు. కాళేశ్వరంతో కొత్తగా ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదని, కాళేశ్వరం బ్యాక్ వాటర్…
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో వివేక్ కుటుంబం చేసింది ఏమీ లేదని తెలంగాణ ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. వివేక్ రోజుకో పార్టీ మార్చే ఊసరవెల్లి.. దొంగే దొంగ అని అరిచినట్టు వివేక్ విమర్శలు ఉన్నాయన్నారు. దళిత బంధువు పైన వివేక్ తన వైఖరి చెప్పాలి. మీ కార్పొరేట్ రాజకీయాలు చెన్నూర్ గడ్డపైన నడువవు. బడ్జెట్ అనుసరించి త్వరలోనే దళిత బంధు పథకం రాష్ట్రం మొత్తం అమలు చేస్తామన్నారు. చెన్నూర్…