చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో నేడు పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం మినీ ట్యాంక్‌బండ్, కేసీఆర్ పార్క్ పేరుతో అర్బన్ పార్కు, ఇంటిగ్రేటెడ్ కూరగాయలు, మాంసం మార్కెట్, మినీ స్పోర్ట్స్ స్టేడియం, జలాల్ పెట్రోల్ బంక్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు నాలుగు లైన్ల రోడ్డు, చెన్నూరులో డంపింగ్ యార్డును మంత్రి హరీష్ రావు ప్రారంభిస్తారు. అనంతరం పట్టణంలో నిర్మిస్తున్న 30 పడకల ఆసుపత్రి పనులను హరీష్ రావు పరిశీలించనున్నారు. చెన్నూరులో 100 పడకల ఆసుపత్రి, కొత్త బస్ డిపోకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
Also Read : SSMB 28: ‘ఆరంభం’… ‘అయోధ్యలో అర్జునుడు’… దీనికే నేషనల్ ట్రెండ్ సృష్టించారా?
జలాల్ ఇంధన కేంద్రం మధ్య అంబేద్కర్ చౌరస్తా మధ్య ఇరుకైన రోడ్డును రూ.25 కోట్లతో విస్తరించారు. కుమ్మరికుంట, పెద్దచెరువులను రూ.9 కోట్లతో మినీ ట్యాంక్‌బండ్‌లుగా అభివృద్ధి చేశారు. చెన్నూరులోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం సమీపంలో రూ.5 కోట్ల అంచనా వ్యయంతో మినీ స్పోర్ట్స్ స్టేడియం నిర్మించగా, రూ.7.02 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కూరగాయలు, మాంసం మార్కెట్‌ను రూపొందించారు. ఇదిలా ఉండగా, చెన్నూరు శివారులో రూ.2 కోట్లతో అర్బన్ పార్కును, జోడు వాగు వద్ద రూ.2 కోట్లతో ఎకో టూరిజం పార్కును రూపొందించారు. 1.25 కోట్ల అంచనా వ్యయంతో డంపింగ్ యార్డును ఏర్పాటు చేశారు.
Also Read : Gold Silver Price Today: మరింత పైకి ఎగబాకిన పసిడి ధర.. ఈ రోజు ఎంతంటే..?
ముందస్తు అరెస్ట్‌లు..
నేడు చెన్నూరులో మంత్రి హరీష్ రావు పర్యటన నేపథ్యంలో బీజేపీ నేతలను ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. జిల్లా కేంద్రంతో పాటు కోటపల్లిలోనూ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. దీంతో మంత్రి హరీష్ రావు పర్యటన నేపథ్యంలో మమ్మల్ని అరెస్ట్ చేయడం ఎందుకని.. మీరు సవ్యమైన పాలన సాగిస్తే భయపడరంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.