తెలంగాణలోని మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఉదయం సినిమా థియేటర్ పై రాళ్లతో దాడి చేసిన వారిపై కేసు నమోదు అయింది. పుష్ప సినిమా వేయకపోవడంతో రాళ్ళతో థియేటర్ పై దాడి చేశారు అభిమానులు. బజ్జూర్ వినయ్ తో పాటు అతని అనుచరులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు పోలీసులు. 04న చెన్నూరుకు చెందిన బజ్జూరి వినయ్, కొంతమంది తన అనుచరులతో కలిసి చెన్నూరులోని శ్రీనివాస థియేటర్ ప్రోప్రైటర్ అయిన కుర్మ రాజమల్ల గౌడ్ వద్దకు వెళ్లి పుష్ప-2 సినిమా థియేటర్లో ఎందుకు ప్రదర్శించడం లేదని అడిగాడు.
PSLV C59 Launch: ‘ప్రోబా-3’ మిషన్ విజయవంతమైంది: ఇస్రో ఛైర్మన్
దానికి రాజమల్ల గౌడ్ థియేటర్ మరమ్మత్తులో ఉన్నందున సినిమాను ప్రదర్శించడం లేదని చెప్పగా దానికి వినయ్ మరియు అతని అనుచరులు పుష్ప-2 సినిమాను థియేటర్లో వేయకపోతే నీ అంత చూస్తామని చెప్పి బెదిరించారు. అనంతరం తన అనుచరులతో కలిసి శ్రీనివాస థియేటర్ వద్దకు వెళ్లి గేటుకు ఉన్న తాళాలు పగలగొట్టి అక్రమంగా లోపలికి ప్రవేశించి రాళ్లతో థియేటర్ అద్దాలను ధ్వంసం చేసి నష్టపరిచారని థియేటర్ ప్రొప్రైటర్ కుర్మా రాజమల్ల గౌడ్ ఫిర్యాదు మేరకు బజ్జూరు వినయ్ మరియు అతని అనుచరులపై కేసు నమోదు చేశారు.