రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానం అనడంలో వాస్తవం లేదు అని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రైతు భరోసా మొదలుకొని వైఎస్సార్ జలకళ వరకూ అనేక పథకాలు అమలు చేస్తున్నాం. తొలి క్యాబినెట్ లోనే ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు 7 లక్షల పరిహారం అందించాలని ఆదేశించిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్. గత ప్రభుత్వంలో సాంకేతిక కారణాల వల్ల ఈ పథకం కింద రాని వారికి 450 మందికి అదనంగా ఇచ్చాం. 2020లో…
చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జగన్ పాలన తీరుపై మండిపడ్డారు. కుప్పం ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఆదరిస్తున్నారు. ఢిల్లీ వెళ్ళాను..రాష్ట్రపతిని కలిశాను. ఏపీలో పరిస్థితులను వివరించాను ఏపీలో రాష్ట్ర ప్రేరేపిత తీవ్రవాదం నడుస్తోంది. ఏపీని పరిపాలించే అర్హత వైసీపీకి లేదు. పేదప్రజలే దేవుళ్ళు-సమాజమే దేవాలయంగా ముందుకు సాగిన పార్టీ తెలుగుదేశం అన్నారు చంద్రబాబు. పోలీసు వ్యవస్థ సహకారంతో టీడీపీ ఆఫీసులపై దాడులు చేశారు. వైసీపీ ప్రభుత్వంపై…
ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణంపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పునీత్ మరణం నన్ను షాక్ కి గురి చేసింది.కన్నడ సినీ పరిశ్రమలో తన విలక్షణమైన నటనతో లక్షలాది మంది అభిమానులను పునీత్ సంపాదించుకున్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న పునీత్ రాజ్ కుమార్ చిన్నవయసులోనే గుండెపోటుకు గురై మృతి చెందడం బాధాకరం. పునీత్ మృతిని తట్టుకునే శక్తిని ఆయన కుటుంబసభ్యులకు భగవంతుడు ఇవ్వాలి. పునీత్ రాజ్ కుమార్ ఆత్మకు శాంతిచేకూరాలని ఆ…
దేశంలో సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ సీడబ్యూసీ మెంబర్ చింతామోహన్ . దేశ పరిస్థితులు బాగాలేవని, ధరలు బాగా పెరిగిపోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. వంటగ్యాస్ ధర మళ్ళీ పెరగబోతోందన్నారు. గ్యాస్ సిలిండర్ వెయ్యిరూపాయలు దాటబోతోందని, పెట్రోల్ డిజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆయన అన్నారు. భారత్ దేశంలో ఆకలి కేకలు ఎక్కువగా ఉన్నాయని, నిరుద్యోగం బాగా పెరిగిపోయిందని విమర్శించారు చింతా మోహన్. ఒకవైపు సామాన్యుడు వందరూపాయలు సంపాదించలేక ఆకలితో అలమటించి పోతుంటే..…
చిత్తూరు : మరికాసేపట్లోనే కుప్పం పర్యటనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. సొంత నియోజక వర్గం లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు చంద్రబాబు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం చేరుకోనున్న చంద్రబాబు నాయుడు…. రెండు గంటలకు బస్టాండ్ వద్ద జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. రేపు సాయంత్రం వరకు కుప్పం అంతటా రోడ్ షో లు, నాయకుల ఇళ్లకు వెళ్లి పరామర్శలు చేయనున్నారు. కుప్పం మున్సిపాలిటీలో ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు…
ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అనుకున్న ముచ్చట తీరకుండానే తిరుగు టపా కట్టేశారు. ప్రధాని మోడీ.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాల అపాయింట్మెంట్ దక్కలేదు. ఇంతకాదు.. అంతకాదు అని బెజవాడలో చెప్పిన టీడీపీ బృందం.. హస్తినలో ఏం చేసింది? ఎందుకు అపాయింట్మెంట్ దక్కలేదు? ఇప్పుడు అమిత్ షా ఫోన్ చేయడం కలిసొస్తుందా? అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా కరుణించని ఢిల్లీ పెద్దలు? బోస్డీకే పదం సృష్టించిన సంచలనాలతో ఏపీలో రాజకీయాలు చాలా హీటెక్కాయి. ఇప్పటి వరకు టీడీపీ చేయని డిమాండ్.. రాష్ట్రపతి…
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 29న కుప్పంలో పర్యటించనున్నారు. గత పది రోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాల దృష్యా కుప్పంలో చంద్రబాబు పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కుప్పంలో రెండు రోజులు పర్యటించనున్న చంద్రబాబు.. 29 కుప్పంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. మరుసటి రోజు 30న కుప్పం పరిధిలోని గ్రామాల్లో పర్యటిస్తారు. అయితే గత పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. కుప్పంలో టీడీపీ ఉనికి కొల్పొకుండా ఉండేందుకు గ్రామస్థాయి…
టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయాలు భగ్గమన్నాయి. ఈ ఘటనపై నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు 36గంటల దీక్ష కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాష్ట్ర పరిణామాలను వివరించేందుకు ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీకి వెళ్లిన ఆయన సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కలిసి ఏపీలో జరుగుతున్న పరిస్థితులను వివరించారు. టీడీపీ కార్యాలయంపై దాడితో పాటు రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విషయంపై కూడా రాష్ట్రపతికి వెల్లడించారు. అనంతరం మంగళవారం కేంద్ర…
ఇప్పటికీ ఏపీలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. గత పది రోజులుగా ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ నేతల మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఏలూరు స్మార్ట్ సిటీ చైర్మన్ గా బొద్దాని అఖిల ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్ళిపోయాడని, గద్దె దిగిపోతూ దిగిపోతూ ప్రజలను కష్టాల్లోకి నెట్టేసాడంటూ ఆరోపణలు…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనను ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యారు.. ఏపీలో పరిణామాలపై ఫిర్యాదు చేసేందుకు హస్తినకు వెళ్లింది చంద్రబాబు టీమ్.. అయితే, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశానికి ప్రయత్నించి విఫలం అయినట్టుగా తెలుస్తోంది.. దీంతో.. హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కినట్టుగా చెబుతున్నారు.. కానీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమయం ఇచ్చినప్పుడు మళ్లీ ఢిల్లీకి వచ్చేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.. ఇక, ఇంగ్లీషు, హిందీ (జాతీయ మీడియా) మీడియా…