రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు ఆపాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఏపీ సర్కార్ ఎయిడెడ్ స్కూళ్లను మూసివేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం విద్యను పేద విద్యార్థులకు అందకుండా ప్రతిపక్ష నేతలు ఏపీ ప్రభుత్వం మండిపడుతున్నారు. దీనిపై స్పందించిన మంత్రి సురేస్ ఎయిడెడ్ స్కూళ్లను తాము ప్రక్షాళన చేస్తున్నామని వ్యాఖ్యానించారు.
నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటినే మూసివేస్తున్నామని.. ప్రైవేటు విద్యకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం చేసే మంచి పనిని పక్కన పెట్టి.. విషప్రచారం చేస్తున్నారని ప్రతి పక్షాలు ఇప్పటికైనా తమ పద్ధతి మార్చుకోవాలని పేర్కొన్నారు.