రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానం అనడంలో వాస్తవం లేదు అని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రైతు భరోసా మొదలుకొని వైఎస్సార్ జలకళ వరకూ అనేక పథకాలు అమలు చేస్తున్నాం. తొలి క్యాబినెట్ లోనే ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు 7 లక్షల పరిహారం అందించాలని ఆదేశించిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్. గత ప్రభుత్వంలో సాంకేతిక కారణాల వల్ల ఈ పథకం కింద రాని వారికి 450 మందికి అదనంగా ఇచ్చాం. 2020లో 225 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏదీ దాచిపెట్టాల్సిన అవసరం మాకు లేదు. NCRB లెక్కలకు, మా లెక్కలకు తేడా ఉంది…ఇదే అంశంపై సరిచూసుకోవాలని వ్యవసాయశాఖ కమిషనర్ లేఖ రాశారు.
2019కి ముందు కూడా ఈ లెక్కల్లో తేడాలు ఉన్నాయి. చంద్రబాబు కుప్పం వెళ్లి హైడ్రామా క్రియేట్ చేస్తున్నారు. ఆ సభలో వైఎస్సార్ కార్యకర్తలు దాడి చేశారు అంటూ డ్రామా చేస్తున్నాడు. నీపై దాడి చేయాల్సిన అవసరం వైస్సార్సీపీకి లేదు. తన హయాంలో గంజాయి సాగు పెరిగితే చంద్రబాబు ఎందుకు ఉక్కుపాదం మోపలేదు అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు 3 లక్షల కేజీల గంజాయి పట్టుకున్నారు…5 వేల మందిని అరెస్ట్ చేశాం. అరెస్టైన వారిలో వివిధ రాష్ట్రాల వారు ఉన్నారు. మన రాష్ట్రంలో 9 మండలాల్లో పండిస్తున్నట్లు సమాచారం ఉంది అని తెలిపారు.