మీరు మారిపోయార్సార్ అంటున్నారు తమ్ముళ్లు..అయితే ఈ మార్పు ఫుల్ టైమా లేక, టెంపరరీనా అని అనుమాన పడుతున్నారట.అధికారానికి దూరమైన సమయంలో వచ్చిన మార్పు నమ్మశక్యంగా లేదనుకుంటున్నారట.ఇదే తీరు గతంలో కూడా ఉండి ఉంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదని కూడా అనుకుంటున్నారని టాక్. ప్రతిపక్షంలోకి వచ్చాక చంద్రబాబు స్టైల్ మారిందా? అధికారంలో ఉండగా దర్శన భాగ్యమే గగనంగాడే పరిస్థితి. అలాంటిది ప్రతిపక్షంలోకి వచ్చాక నేరుగా కార్యకర్తలతో ఫోన్-ఇన్ కార్యక్రమాలు నడిపించేస్తున్నారట. ప్రతి రెండు రోజులకోసారి క్షేత్ర స్థాయిలో…
ఏపీలో ఎన్నికలు జరగని మునిసిపాలిటీలు, కార్పోరేషన్లు, పంచాయతీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. నెల్లూరు కార్పోరేషన్ ఎన్నికల అక్రమాల పై హైకోర్టును ఆశ్రయించనుంది తెలుగుదేశం పార్టీ. రిటర్నింగ్ అధికారి ఏకపక్ష నిర్ణయాలపై హైకోర్టు కు వెళ్లాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి రిటర్నింగ్ అధికారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించడంపై హైకోర్టును ఆశ్రయించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపారు. నామినేషన్ల తిరస్కరణను సీరియస్ గా తీసుకున్న…
బెజవాడ టీడీపీ రాజకీయాల్లో కుదుపు. టీడీపీ కి మరో షాక్ తగిలింది. పశ్చిమ నియోజకవర్గంకు చెందిన కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్య టీడీపీ గుడ్ బై చెప్పారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమక్షంలో వైసీపీ లో చేరారు లావణ్య. ఇటీవల జరిగిన విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో లావణ్య టీడీపీ తరఫున గెలిచారు. విజయవాడ కార్పోరేషన్ కైవసం చేసుకోవాలని టీడీపీ ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఎంపీ కేశినేని నాని కూతురు కేశినేని శ్వేతను మేయర్ అభ్యర్ధిగా ప్రకటించి…
పెట్రోల్, డీజిల్ పై కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనితో పాటు బీజేపీ పాలిత ప్రాంతాలతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ రాష్ట్ర వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలపై రాష్ట్ర వ్యాట్‌ను తగ్గించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. అంతేకాకుండా పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర వ్యాట్ తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఈ నెల 9…
వరుసగా పెరుగుతూ పెట్రో ధరలు ఆల్‌టైం హై రికార్డులు సృష్టించాయి.. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో.. కేంద్రం కోత విధించింది.. ఇక, కేంద్రం బాటలోనే మరికొన్ని రాష్ట్రాలు అడుగులు వేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ వాటాను కూడా తగ్గించాయి. దీంతో.. ఇప్పుడు తగ్గించని రాష్ట్రాలపై ఒత్తిడి పెరుగుతోంది.. అందులో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కూడా ఒకటి కాగా.. పెట్రో ధరలపై పోరాటానికి సిద్ధం అవుతోంది తెలుగుదేశం పార్టీ.. ఇవాళ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఈ…
దమ్ముంటే ఇప్పుడు ఎన్నికలు పెట్టండి.. మీ పెతాపమో.. మా పెతాపమో తేల్చుకుందాం అని సవాళ్లు విసిరిన టీడీపీకి..ఇప్పుడు కొత్త చిక్కొచ్చి పడిందా? స్థానిక సంస్థల ఎన్నికలు ఆ పార్టీకి అగ్నిపరీక్షగా మారబోతున్నాయా? తెలుగు తమ్ముళ్లు ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడ్డారా? మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికల్లో శక్తిని చాటుకోక తప్పదా? ఏపీలో వివిధ కారణాలతో మిగిలిపోయిన స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడత ఎలక్షన్స్ జరిగినప్పుడు నామినేషన్ల దాఖలు, ఏకగ్రీవాల విషయంలో అధికారపార్టీ…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. ఇవాళ చివరి రోజు భారీగా నమోదయ్యాయి నామినేషన్లు. 15న మునిసిపాలిటీ, 16న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. నెల్లూరు కార్పోరేషన్ సహా 12 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. చంద్రబాబు స్వంత నియోజకవర్గం అయిన కుప్పం, నెల్లూరు కార్పోరేషన్ పైనే అందరి ఫోకస్ పడింది. కుప్పంలో పాగా వేయాలని వైసీపీ స్కెచ్ వేసింది. అక్కడ ఎలాగైనా పరువు నిలుపుకోవాలని టీడీపీ నేతలు పట్టుమీద వున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పలు ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న ఘటనలపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు చంద్రబాబు లేఖ రాశారు. కుప్పంలో 14వ వార్డు టీడీపీ అభ్యర్ధిపై వైసీపీ దాడి చేసిందని ఫిర్యాదు చేశారు. దాడికి సంబంధించిన ఫొటోలను లేఖకు జతచేశారు చంద్రబాబు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయి. 14వ వార్డు టీడీపీ ఎస్సీ అభ్యర్థి వెంకటేశ్‌పై వైసీపీ నేతలు దాడి చేశారు. నామినేషన్ దాఖలు చేసే కేంద్రం…
న్యాయస్థానం టు దేవస్థానం అంటూ అమరావతిలో రైతులు సాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. రాజధాని ఉద్యమం రైతులది కాదు. టీడీపీ కార్యకర్తలదే అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. చెరకు రైతులకు బకాయిలు పూర్తిగా చెల్లిస్తామని, ఎన్‌సిఎస్ సుగర్స్‌కు చెందిన 24 ఎకరాలను వేలం వేసి ఆ సొమ్ముతో బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్‌సిఎస్ సుగర్స్ పై ఆర్ఆర్ యాక్ట్ ప్రయోగిస్తాం. ఫ్యాక్టరీ భూములను విక్రయించి, రైతుల బకాయిలను వీలైనంత త్వరగా చెల్లిస్తాం. రూ.10కోట్లు విలువైన పంచదారను…