ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటుకు జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి అభివృద్ధికి తమ భూములు ఇచ్చిన రైతులు నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి 45 రోజుల పాటు మహా పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ పాదయాత్రకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంఘీభావం తెలిపారు.
అంతేకాకుండా రాజధాని అమరావతిని కాపాడుకోవాలని ఆకాంక్షిస్తున్నవారు రైతుల మహాపాదయాత్రకు మద్దతుగా నిలువాలన్నారు. రాజధానికి కాపాడుకోకపోతే రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో పడిపోతుందని అన్నారు. మూడు రాజధానుల పేరుతో రివర్స్ పాలనకు తెరలేపిన వైసీపీ నాయకులకు ఇప్పటికైనా కనువిప్పు కలగాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.