Nandamuri Ramakrishna Becomes Emtional on Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వార్త ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ విషయంలో వైసీపీ శ్రేణలు ఆనందం వ్యక్తం చేస్తుంటే టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఇది అప్రజాస్వామికం అని అన్నారు. ఇక బాబు అరెస్టుపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని ఇవాళ నారా భువనేశ్వరి దర్శించుకున్నారు, ఆమెతో ఉన్న ఆమె సోదరుడు నందమూరి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చాం, ఆమె ఆశీస్సులు మనందరికీ ఉంటాయి. మీ అందరి ఆశీసులు కూడా మా కుటుంబంపై ఉండాలని కోరుకున్నాం, మన ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడే హక్కు ఉంది. ఇప్పటి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.
Kodali Nani: బాలకృష్ణపై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు
చంద్రబాబు గారిని రాత్రికి రాత్రి 2021లో ఉన్న కేసులో అరెస్ట్ చేయడం చాలా అన్యాయం, దగా, మోసం. పగ తీర్చుకుంటున్నట్టు అనిపిస్తోంది. బాబు ఎంత కష్టపడతారో తెలుగు వారందరికీ తెలుసు. ముఖమంత్రి ఆంధ్రను వదిలేసి హాయిగా విదేశాల్లో తిరుగుతున్నారు. మళ్ళీ బాబును గెలిపించుకుందాం, ఏపీని మొదటి స్థానంలో పెట్టి అభివృద్ధి చేసుకుందాం అని అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. బాధలు చెప్పుకోవడానికి దుర్గమ్మను దర్శించుకున్నానని, బాబును రక్షించాలని కోరుకున్నట్లు చెప్పారు. ఏపీ ప్రజల హక్కుల కోసం చంద్రబాబు పోరాడుతున్నానని, ఆయనకు ప్రతిఒక్కరూ మద్దతివ్వాలని భువనేశ్వరి పిలుపునిచ్చారు. ‘చంద్రబాబుకు మనోధైర్యం ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నా.. రాష్ట్ర శ్రేయస్సు కోసమే చంద్రబాబు పోరాటం.. చంద్రబాబుకు ప్రజల మద్దతు ఉంది, చేయి చేయి కలిపి చంద్రబాబు పోరాటం దిగ్విజయం చేయాలి’ అని భువనేశ్వరి కోరారు.
చంద్రబాబును మళ్లీ సీఎం చేద్దాం..కంటతడి పెట్టుకున్న నందమూరి రామకృష్ణ..#NanadmuriRamakrishna #NaraBhuvaneshwari #NaraChandrababuNaidu #ChandrababuNaidu #ChandrababuArrest #ChandrababuNaiduArrest #TDP #AndhraPradesh #NTVTelugu pic.twitter.com/x8pAXUUJni
— NTV Telugu (@NtvTeluguLive) September 9, 2023