క్రికెట్లో టీమిండియా ఎక్కడ ఆడినా ఆదరణ లభిస్తుంది. మరి ముఖ్యంగా ఆసియా కప్ లాంటి టోర్నమెంట్లలో అయితే ఇది కాస్త ఎక్కువగానే ఉంటుంది. దానికి కారణం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. అవును ఆసియాకప్ లో ఇరుజట్లు 2 సార్లు తలపడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మరింత రసవత్తరంగా సాగుతుంది.పైగా ఆసియాలోనే ఇవి రెండు బలమైన జట్లు. అందుకే రెండు లేదా 3 సార్లు తలపడే ఛాన్స్ ఉంటుంది. నిజంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ కిక్కే…
భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపిక కాకపోయినా.. తన ప్రదర్శనపై దృష్టి సారించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఆర్సీబీ జట్టులో 7 సంవత్సరాల పాటు ఆడిన ఫాస్ట్ బౌలర్.. ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడనున్నాడు. తన కొత్త జట్టుకు మెరుగైన ప్రదర్శన అందించేందుకు రెడీ అవుతున్నాడు. చాలా గ్యాప్ తర్వాత సిరాజ్ ఐపీఎల్ 2025 సీజన్‌లోకి అడుగుపెట్టనున్నాడు.
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ తర్వాత టీమిండియా కీలక ప్లేయర్స్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వన్డేల నుంచి రిటైర్ కాబోతున్నారంటూ జోరుగ చర్చ జరిగింది. క్రికెట్ ఫ్యాన్స్ అంతా దీనిపైనే చర్చించుకున్నారు. అయితే ఇండియా vs న్యూజిలాండ్ ఫైనల్ తర్వాత రోహిత్ అన్ని ఊహాగానాలకు చెక్ పెట్టాడు. వన్డే ఫార్మాట్‌కు తాను వీడ్కోలు పలకబోనని ప్రకటించాడు. రిటైర్ మెంట్ ప్రచారాన్ని ఆపాలని మీడియాను కోరాడు. తాజాగా భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి…
MP: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఘన విజయం సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ టీమ్‌ని రోహిత్ సేన ఓడించింది. ఈ విజయం పట్ల దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు వేడక చేసుకున్నారు. విజయం అనంతరం రోడ్లపైకి వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తి చేశారు. అయితే, మధ్యప్రదేశ్ మోవ్, దేవాస్ నగరాల్లో విజయోత్సవాల్లో ఉద్రిక్తత నెలకొంది, ఘర్షకు కారణమైంది. దీంతో హింస చెలరేగింది. Read Also: Parliamentary Panel: రోహింగ్యా, బంగ్లాదేశీలను భారత్ నుంచి పంపించాలి.. అయితే,…
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్‌ను ఓడించి టైటిల్ కైవస చేసుకుంది. దీంతో టీమిండియా రికార్డు స్థాయిలో మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. టీమిండియా విజయం సాధించిన తర్వాత, స్టేడియం లోపల, వెలుపల సంబరాలు అంబరాన్నంటాయి. క్రికెట్ ఫ్యాన్స్ ర్యాలీలు తీస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. క్రికెట్ దిగ్గజాలు కూడా సెలబ్రేషన్స్ లో భాగమయ్యారు. వీరిలో భారత క్రికెట్ దిగ్గజం, టీం ఇండియా మాజీ లెజెండరీ బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్ వీడియో…
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మార్చి 9న భారత్-కివీస్ మధ్య ఫైనల్ పోరు జరుగనున్నది. టైటిలే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ వేళ జోరుగా బెట్టింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం దుబాయ్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌పై రూ. 5,000 కోట్ల బెట్టింగ్స్ జరిగాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఐదుగురు…
Mohammed Shami: టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీని ఉద్దేశించి, ఆల్ ఇండియా ముస్లిం జమాత్ చీఫ్ మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ గురువారం దారుణమైన విమర్శలు చేయడంపై క్రీడాభిమానులు, నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. దేశం కోసం ఆడుతున్న వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, మతాన్ని ఆపాదించడం సరైనది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంజన్ మాసంలో ‘రోజా’ను పాటించకుండా, మ్యాచ్ సమయంలో షమీ నీరు, ఇతర డ్రింక్స్ తాగడాని షాబుద్దీన్ అన్నారు. షమీని క్రిమినల్‌గా పోల్చుతూ విమర్శించారు.
కాంగోలో వింత వ్యాధి.. రెండ్రోజుల్లో 50 మంది మృతి ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటైన కాంగోలో ఓ వింత వ్యాధి హడలెత్తిస్తుంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు 50 మంది మరణించారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన 48 గంటల్లోనే రోగులు మరణిస్తున్నారు. గబ్బిలాలు తిన్న ముగ్గురు పిల్లలలో ఈ వ్యాధి మొదట గుర్తించినట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ తరువాత ఈ వ్యాధికి సంబంధించిన కేసులు వేగంగా పెరగడం…
పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీపై ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లుగా సమాచారం అందుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి హాజరవుతున్న విదేశీయులను కిడ్నాప్ చేయడానికి ‘కుట్ర’ జరుగుతుందని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ హెచ్చరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Ind vs Pak : దుబాయ్ వేదికగా దాయాది జట్లు పాకిస్తాన్, భారత్ తలపడుతున్నాయి. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ రెండు జట్లు నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ పడుతున్నాయి..