కాంగోలో వింత వ్యాధి.. రెండ్రోజుల్లో 50 మంది మృతి
ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటైన కాంగోలో ఓ వింత వ్యాధి హడలెత్తిస్తుంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు 50 మంది మరణించారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన 48 గంటల్లోనే రోగులు మరణిస్తున్నారు. గబ్బిలాలు తిన్న ముగ్గురు పిల్లలలో ఈ వ్యాధి మొదట గుర్తించినట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ తరువాత ఈ వ్యాధికి సంబంధించిన కేసులు వేగంగా పెరగడం ప్రారంభించాయి.
కాంగోలో వ్యాపిస్తున్న ఈ వ్యాధి చాలా ప్రమాదకరమని చెబుతున్నారు. రోగుల్లో లక్షణాలు కనిపించిన తర్వాత చాలా మంది 48 గంటల్లోనే మరణించారు. ఈ వ్యాధి ప్రారంభ లక్షణాలు రోగిలో జ్వరం, వాంతులు, అంతర్గత రక్తస్రావం (ఇంటర్నల్ బ్లీడింగ్) ఉంటాయి. ఈ కారణంగా.. ఈ వ్యాధి చాలా డేంజరస్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంట్నరల్ బ్లీడింగ్ లక్షణాలు ఎలా ఉంటాయంటే.. రక్తస్రావం జ్వరం ఎబోలా, డెంగ్యూ, మార్బర్గ్, ఎల్లో ఫీవర్ వంటి ప్రాణాంతక వైరస్ తో సంబంధం కలిగి ఉన్నాయి. అయితే, ఇప్పటివరకు అందుకున్న డజనుకు పైగా నమూనాల పరీక్షల నుండి పరిశోధకులు ఈ వ్యాధికి ఈ వైరస్‌లతో ఎటువంటి సంబంధం లేదని కనుగొన్నారు.
జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలు బలి
లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లంగర్ హౌస్ హుడా పార్క్ చెరువు శుభ్రం చేసే క్రమంలో తండ్రి కొడుకుల మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. లంగర్ హౌస్ లోని హుడా పార్క్ చెరువులో చెరువు శుభ్రం చేసే ఔట్‌సోర్సింగ్ సిబ్బంది మహమ్మద్ కరీం (38 ) ఈరోజు శివరాత్రి సందర్భంగా స్కూలుకి సెలవు ఉండడం వల్ల తన కొడుకు సాహిల్ (15)ను తనతో పాటు తీసుకువచ్చాడు. ఈరోజు మధ్యాహ్నం సుమారు ఒంటి గంట ప్రాంతంలో మహమ్మద్ కరీం తన కొడుకు సాయిల్ తో కలిసి హుడా పార్క్ చెరువులోని గుర్రపు డెక్కను శుభ్రం చేసే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. సాహిల్ లోతైన ప్రాంతానికి వెళ్లడంతో అక్కడ బురదలో ఇరుక్కుపోయి తన తండ్రిని సహాయం కోరాడు. దీంతో తండ్రి కరీం కూడా వెళ్లి తన కొడుకు సాయం చేసే క్రమంలో ఇద్దరు నీళ్లలో లోతుగా బురదలో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గజ ఈతగాళ్లు తీవ్రంగా శ్రమించి సాయంత్రం సమయానికి ఇద్దరి మృతదేహాలను బయటకు వెలికితీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీస్ స్టేషన్‌కి 100 మీటర్ల దూరంలో, ఆగి ఉన్న బస్సులో మహిళపై అత్యాచారం..
పూణేలో దారుణం చోటు చేసుకుంది. రద్దీగా ఉండే స్వర్గేట్ బస్టాండ్‌లో, పోలీస్ స్టేషన్‌కి కూతవేటు దూరంలో మహిళపై అత్యాచారం జరగడం సంచలనంగా మారింది. నిందితుడిని దత్తాత్రేయ రాందాస్‌గా గుర్తించారు. పోలీస్ స్టేషన్‌కి 100 మీటర్ల దూరంలో, నిలిచి ఉన్న బస్సులో మంగళవారం 26 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగింది. సీసీటీవీ కెమెరాల్లో నిందితుడిని గుర్తించారు. నిందితుడిని పట్టుకునేందుకు 8 పోలీస్ టీంలను ఏర్పాటు చేశారు. స్నిఫర్ డాగ్స్‌ని రంగంలోకి దించారు. నిందితుడు 36 ఏళ్ల రాందాస్‌కి గతంలో నేరచరిత్ర ఉన్నట్లు గుర్తించారు.
టన్నెల్‌లో చిక్కుకున్న వారి కోసం అధికారులు అంతా నిబద్ధతతో పని చేస్తున్నారు…
శ్రీశైలం సమీపంలోని SLBC టన్నెల్‌లో ఘోర ప్రమాదం సంభవించి, ఎనిమిది మంది సిబ్బంది అందులో చిక్కుకుపోయారు. ఈ ఘటన జరిగిన నాలుగు రోజులు గడిచినా, కార్మికుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. వారి కోసం అధికారులు అన్ని విధాలుగా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. రక్షణ చర్యల్లో పురోగతి కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అయితే.. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అక్కడ పేరుకుపోయిన మట్టి నీరు సిల్ట్ వుందన్నారు. 15 నుండి 20 మీటర్ల వరకు బురద నీటితో కూరుకుపోయిందని, దేశంలోని బెస్ట్ ఆర్మీ ఆఫీసర్ లను రప్పించామన్నారు. గ్యాస్ కట్టర్ లలో tbm మిషన్ భాగాలను తొలగించేందుకు నిర్ణయించుకున్నామని, నిన్న వాటర్ బయటికి పంపే ప్రయత్నంలో…. రిస్క్యూ ఆపరేషన్ కాస్త లేట్ అయ్యిందని ఆయన వ్యాఖ్యానించారు. రెస్క్యూ లో పాల్గొనే వారు రిస్క్యూలో పడకూడదని నిర్ణయంతో ముందుకు వెళుతున్నామని, అధికారులు అంతా నిబద్ధతతో పని చేస్తున్నారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సిల్ట్ లోకీ వెళ్ళి కూరుకుపోయిన వారిని బయటకు తెచ్చేందుకు ఇప్పటి నుండే యాక్షన్ ఉంటుందని, బెస్ట్ టన్నెల్ ఎక్స్ పర్ట్ లను రప్పించామని ఉత్తమ్ తెలిపారు. మరో రెండు రెండు రోజుల్లో వారి ఆచూకి తెలుసుకుంటామన్నారు. వారీ బ్రతికి వున్నారనే నమ్మకంతో రెస్క్యూ మిషన్ వేగవంతం చేసామని, రెస్క్యూ మిషన్ లో చాలా సాంకేతిక సమస్యలు వస్తున్నాయన్నారు. ప్లాస్మా కట్టర్, వెల్డింగ్ పరికరాలతో tbm మిషన్ వెనుక భాగాన్ని తొలగిస్తామని, దీన్ని రాజకీయ కోణంలో చూడకూడదన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ఏడున్నరేళ్ళ తరువాత ఒక వీరుడి సినిమా చూశాననే ఆనందం ఉంది..
హిందూ సామ్రాజ్య స్థాపనకు కృషి చేసిన శంభాజీ మహారాజ్ సినిమాను విజయవాడలో మంత్రి సత్యకుమార్ యాదవ్ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడున్నరేళ్ళ తరువాత సినిమా చూశానని.. ఒక వీరుడి సినిమా చూశాననే ఆనందం ఉందన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్. ఒక వీరుడి ముగింపు అలా జరిగినందుకు వేదన ఉంది.. ఛత్రపతి శివాజీ, శంభాజీ మహారాజ్‌లను మొదటి స్వాతంత్ర్య యోధులుగా చెప్పాలని పేర్కొన్నారు. అలాంటి వారి చరిత్ర సినిమాగా తీసినందుకు దర్శక నిర్మాతలను అభినందిస్తున్నానని తెలిపారు. సమకాలీన చరిత్రకారుల పైన సినిమా తీయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అభిప్రాయపడ్డారు.
మయన్మార్ సరిహద్దుల్లో చైనా రాడార్.. భారత్‌కి భద్రతా ముప్పు..
భారత సరిహద్దుల్లో చైనా తన మిలిటరీ సామర్థ్యాన్ని విస్తరిస్తోంది. తాజాగా, మయన్మార్ సరిహద్దుకు సమీపంలో నైరుతి యువాన్ ప్రావిన్సులో చైనా ఒక అధునాతన రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇది భారత్‌కి భద్రతాపరంగా ఇబ్బందులు కలిగిస్తుంది. భారత మిస్సైల్ ప్రోగ్రాం, జాతీయ భద్రతపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కొత్తగా ఏర్పాటు చేయబడిన లార్జ్ ఫేజ్డ్ అర్రే రాడార్ (LPAR) 5,000 కిలోమీటర్లకు పైగా నిఘా పరిధిని కలిగి ఉందని తెలుస్తోంది. దీని ద్వారా చైనా హిందూ మహాసముద్రంలోని ప్రాంతాలపై, భారత భూభాగాలను కూడా పర్యవేక్షించగలదు. ఈ అధునాతన రాడార్ వ్యవస్థ చైనా నిఘా సేకరణ సామర్థ్యాలను, ముఖ్యంగా ఇండియా బాలిస్టిక్ మిస్సైల్ ప్రోగ్రామ్‌కి సంబంధించి కన్నేసి ఉంచగలదు.
ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అఫ్గాన్ ప్లేయర్ రికార్డ్..
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. బుధవారం ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. లాహోర్ క్రికెట్ స్టేడియంలో ఇంగ్లీష్ బౌలర్లు ఓ ఆట ఆడుకున్నాడు. అతని అద్భుతమైన ఇన్నింగ్స్‌తో కొత్త రికార్డు సృష్టించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడి ఇబ్రహీం ఘనత సాధించాడు. 146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 177 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ రికార్డును ఇబ్రహీం బద్దలు కొట్టాడు. డకెట్ రికార్డు 5 రోజులు కూడా నిలవలేదు. ఫిబ్రవరి 22న ఆస్ట్రేలియాపై డకెట్ 143 బంతుల్లో 165 పరుగులు చేశాడు. ఇబ్రహీం తన వన్డే కెరీర్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేయడమే కాకుండా.. ఆఫ్ఘనిస్తాన్ తరపున వన్డేలో అత్యధిక ఇన్నింగ్స్ ఆడి రికార్డు సృష్టించాడు. గతంలో కూడా ఈ రికార్డు ఇబ్రహీం పేరిట ఉండేది. పాకిస్తాన్ గడ్డపై 4వ సారి అత్యధిక పరుగుల వన్డే ఇన్నింగ్స్ ఆడిన ఘనతను ఇబ్రహీం సాధించాడు. ఇబ్రహీం.. డకెట్ (165), ఆండ్రూ హడ్సన్ (161)ల రికార్డులను బద్దలు కొట్టాడు. పాకిస్తాన్ గడ్డపై వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డు గ్యారీ కిర్‌స్టన్ పేరిట ఉంది. దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్ కిర్‌స్టన్ 1996లో రావల్పిండి మైదానంలో యుఎఈపై అజేయంగా 188 పరుగులు చేశాడు.
పాక్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్..!
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం చాలా పరిస్థితిని ఎదుర్కొంటోంది. 29 సంవత్సరాల తర్వాత ఐసిసి ఈవెంట్‌ను నిర్వహిస్తున్న పాకిస్తాన్‌కు ఇబ్బందులు పెరుగుతున్నాయి. మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుండి పాకిస్తాన్ జట్టు నిష్క్రమించింది. ఈ బాధ నుంచి బయటపడక ముందే జట్టుకు మరో పెద్ద దెబ్బ తగిలింది. మీడియా నివేదికల ప్రకారం.. పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ వన్డే క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
“ఓ మూర్ఖులారా… సిద్ధిపేటకు వచ్చి గోదావరి జలాలు చూసి కళ్లు తెరవండి!”
తెలంగాణలో ప్రాజెక్టుల కూల్చివేత, పాలకపక్షం-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరిపోతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడుతూ, “కొంతమంది మూర్ఖులు గాంధీ భవన్‌లో కూర్చొని కాళేశ్వరం కూలిపోయిందంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఓ మూర్ఖులారా! ఒక్కసారి సిద్ధిపేటకి వచ్చి గలగల పారుతున్న గోదావరి జలాలు చూసి కళ్లు తెరవండి,” అంటూ హరీష్ రావు ఘాటుగా స్పందించారు. హరీష్ రావు చెప్పినట్లుగా, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల సిద్ధిపేట జిల్లాలో 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు జిల్లాలోని రైతులకు జీవనాధారంగా మారాయని హరీష్ రావు గుర్తు చేశారు. “కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ కుంగితే, దాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. కానీ, మీ పాలనలో కూలిపోయిన ప్రాజెక్టుల గురించి మీకు జ్ఞాపకం లేదా?” అంటూ ఆయన ప్రశ్నించారు.
యూనస్, పాక్ జోక్యంపై బంగ్లా ఆర్మీ చీఫ్ అసహనం.. తిరుగుబాటు తప్పదా..?
బంగ్లాదేశ్‌లో పరిణామాలు వేగంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ వ్యాఖ్యలు చూస్తే, రాబోయే కొన్ని రోజుల్లో మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వంపై బంగ్లాదేశ్ ఆర్మీ తీవ్ర అసహనంతో ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఇందుకు తాజాగా, బంగ్లా ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు మద్దతు ఇస్తున్నాయి. దేశంలో శాంతిభద్రతల సమస్యపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల గురించి, ఫిబ్రవరి 25న జరిగిన జాతీయ అమరవీరుల సైనిక దినోత్సవంలో ఆయన మాట్లాడారు. దిగజారిన పరిస్థితులకు, భద్రతా పరిస్థితికి రాజకీయ కలహాలే కారణమని, ప్రజలు ఒకరినొకరు దూషించుకుంటున్నారని చెప్పారు. పోలీసుల అసమర్థత గురించి వ్యాఖ్యానించారు. అంతర్గత పోరాటాలు బంగ్లాదేశ్ సార్వభౌమత్వాన్ని ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని అంతర్గత విభజనలు ఆగిపోవాలని జమాన్ అన్నారు. షేక్ హసీనా దిగిపోయిన తర్వాత యూనస్ ప్రభుత్వాధినేతగా బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి అక్కడ హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపులు రెచ్చిపోతున్నాయి.