పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. తాజాగా ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును కేంద్రం పొడిగించింది. ఈ గడువును మార్చి 15 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ గడువు డిసెంబర్ 31 వరకు ఉంది. కాగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును పొడిగించినట్లు కేంద్రం తెలిపింది. Read Also: ఐపీఎల్ స్పాన్సర్‌గా చైనా కంపెనీ అవుట్… ఇకపై ‘టాటా’ ఐపీఎల్…
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితి అస్థిరంగా ఉందని…. కరోనాతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య సైతం మారొచ్చని అప్రమత్తం చేశారు. వైద్య సిబ్బంది సేవలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని ప్రభుత్వాలకు సూచించారు. జంబో వైద్య కేంద్రాలు, ఫీల్డ్ ఆస్పత్రులను ఏర్పాటు చేసిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ప్రశంసించారు. దేశ వ్యాప్తంగా కరోనా సోకిన వారిలో కేవలం…
స్కోచ్ గ్రూప్ 78వ ఎడిషన్‌లో భాగంగా జాతీయ స్థాయిలో ప్రకటించిన అవార్డుల్లో దేశంలోనే అత్యధిక అవార్డులు ఏపీని వరించాయి. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 113 నామినేషన్స్ రాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వివిధ కేటగిరిలలో ఐదు గోల్డ్, ఐదు సిల్వర్ స్కోచ్ అవార్డులు దక్కాయి. ఢిల్లీ నుంచి గురువారం నిర్వహించిన వెబినార్‌లో స్కోచ్ గ్రూప్ ఎండీ గురుషరన్‌దంజల్ ఈ అవార్డులను ప్రకటించారు. Read Also: శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక కాగా ఏపీ ప్రభుత్వం…
కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న ప్రైవేటీకరణకు నిరసనగా ఆందోళనలను చేపట్టేందుకు భారతీయ మజ్దూర్ యూనియన్ సిద్ధమైందని ఆ సంఘం జాతీ ఉపాధ్యాక్షుడు మల్లేష్ అన్నారు. ఈ మేరకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాచిగూడలోని జాగృతి భవన్‌లో సంఘ్ నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసే కుట్ర జరుగుతుందన్నారు. Read Also:నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు పనిచేయకుంటే పక్కకు తప్పుకోండి: చంద్రబాబు ఎల్‌ఐసీలోని లక్ష కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకోవడంవల్ల ఎల్‌ఐసీ మనుగడ…
ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పుల సంఖ్య మరింత పెరుగుతోంది. తాజాగా మరో రూ.2,500 కోట్ల రుణాన్ని ఏపీ ప్రభుత్వం సమీకరించింది. రిజర్వుబ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని ప్రభుత్వం ఈ రుణాన్ని పొందింది. రాబోయే 20 ఏళ్ల కాలపరిమితితో రుణం తిరిగి చెల్లించేలా 7.22 శాతం వడ్డీతో రూ.వెయ్యి కోట్లు తీసుకుంది. మరో వెయ్యి కోట్లను 18 ఏళ్ల కాలపరిమితికి 7.18 శాతం వడ్డీకి స్వీకరించింది. మరో రూ.500 కోట్లను 16 ఏళ్ల కాలపరిమితితో 7.24 శాతం…
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి కేంద్ర ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పింది. కేంద్రం కొత్తగా సవరించిన నిబంధనలకు అనుగుణంగా టీటీడీ ఎఫ్సీఆర్ఏ (ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్) లైసెన్సుకు రెన్యువల్ దరఖాస్తు చేసుకోలేకపోయింది. దీంతో టీటీడీ దరఖాస్తును కేంద్రం తిరస్కరించింది. ఈ కారణంగా టీటీడీకి వచ్చే విరాళాలు భారీ మొత్తంలో ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో 2020-21 ఏడాదిలో టీటీడీకి విదేశీ విరాళాల రూపంలో ఒక్క రూపాయి కూడా అందలేదు. Read Also: భారత్‌లో భారీగా పెరిగిన కరోనా…
ప్రధాని మోడీతో సమావేశ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ సీఎం జగన్ చర్చలు జరిపారు. ఈమేరకు విజ్ఞాపన పత్రాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు జగన్ అందించారు. ప్రత్యేక హోదా అంశం, సవరించిన పోలవరం అంచనాలకు ఆమోదం. రెవెన్యూ లోటు భర్తీ, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, రుణపరిమితి, రాష్ట్రానికి ఇతోధికంగా ఆర్థిక సహాయం తదితర అంశాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించిన సీఎం జగన్. ఇవే కాకుండా…
తెలంగాణ రాష్ట్రం మరో అరుదైన ఘనత సాధించింది. బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రాలలో దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక ప్రకారం… ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ (ODF) విషయంలో తెలంగాణ 96.74 శాతంతో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ తర్వాతి స్థానంలో తమిళనాడు (35.39 శాతం), కేరళ (19.78 శాతం), ఉత్తరాఖండ్ (9.01 శాతం), హర్యానా (5.75 శాతం), కర్ణాటక (5.59 శాతం), ఆంధ్రప్రదేశ్ (4.63 శాతం) ఉన్నాయి. జమ్మూకశ్మీర్, బీహార్,…
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 10వ విడత నిధులను ప్రధాని మోడీ శనివారం విడుదల చేశారు. వర్చువల్‌గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రధాని మోడీ నిధులను విడుదల చేశారు. పలువురు లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ పథకం ఫండ్ నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. ఈ పథకంలో ఇప్పటివరకు రూ. 1.6 లక్షల కోట్లకు పైగా సమ్మన్ నిధులను రైతు కుటుంబాలకు బదిలీ చేశారు. Read Also:హైదరాబాద్‌లో మరో భారీ ఫ్లైఓవర్ ప్రారంభం పీఎం…
దేశంలో జీఎస్టీ వసూళ్లు వరుసగా ఆరో నెల కూడా లక్ష కోట్లు దాటాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో రూ.1,29,780 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా (సీజీఎస్టీ) రూ.22,578 కోట్లు కాగా… రాష్ట్రాల వాటా (ఎస్జీఎస్టీ) రూ.28,658 కోట్లు, అంతర్జాతీయ వాటా (ఐజీఎస్టీ) రూ.69,155 కోట్లుగా నమోదయ్యాయి. ఐజీఎస్టీలో దిగుమతిపై వచ్చిన రూ.37,527 కోట్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా సెస్ రూపంలో రూ.9,389 కోట్లు వసూలయ్యాయి. Read…