కరోనాపై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్.. ఇకపై రాత్రి 10 గంటల వరకు టీకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితి అస్థిరంగా ఉందని…. కరోనాతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య సైతం మారొచ్చని అప్రమత్తం చేశారు. వైద్య సిబ్బంది సేవలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని ప్రభుత్వాలకు సూచించారు. జంబో వైద్య కేంద్రాలు, ఫీల్డ్ ఆస్పత్రులను ఏర్పాటు చేసిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ప్రశంసించారు. దేశ వ్యాప్తంగా కరోనా సోకిన వారిలో కేవలం 5 నుంచి 10 శాతం మంది బాధితులకే ఆస్పత్రిలో చికిత్స అవసరం అవుతుందని తెలిపారు. మిగితా వారికి హోం ఐసోలేషన్ ఉంటే సరిపోతుందని తెలిపారు.
కరోనా సోకిన రోగులను ఆస్పత్రులను తరలించేందుకు ఇబ్బందులు కలగకుండా అదనపు అంబులెన్సులను సిద్ధం చేసుకోవాలి. అన్ని జిల్లా ఆస్పత్రులు, బోధనాస్పత్రులను ఈ-సంజీవని టెలీకన్సల్టేషన్ హబ్‌లుగా ఉపయోగించుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచనలు జారీ చేసింది. కరోనా రోగుల కోసం ప్రైవేట్ ఆస్పత్రుల్లో వివిధ రకాల పడకలు అందుబాటులో ఉండాలని… ఆయా ఆస్పత్రులు, క్లినిక్స్‌లలో వసూలు చేసే ఫీజులు ప్రజలకు అందుబాటులో ఉండాలని.. ఒకవేళ అధిక రుసుములు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు కరోనా వ్యాక్సిన్ సమయాన్ని రాత్రి 10 గంటల వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వ్యాక్సిన్ కోసం ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
Also Read
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
తాజావార్తలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్‌కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
-
Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్‌కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!