వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని ఢిల్లీకి వెళ్లిన మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ .. కేంద్ర ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ..ఇది చాలా గంభీరమైన విషయమన్నారు. మరోసారి సమీక్ష చేసి రైతాంగాన్ని సంప్రదించిన తర్వాత తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీన్ని ఇంతటితో వదిలిపెట్టేది లేదన్నారు. అందమైన భాషలో ఉపన్యాసాలు ఇచ్చి, ఇదే దేశ భక్తి అంటే ఎలా…? అని…
కేంద్ర ప్రభుత్వ, బీజేపీ వైఖరి మారుతుందని వారం రోజుల నుంచి ఆశపడ్డాం అయినా.. వారిలో మార్పు లేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లను కొనుగోలు చేయమని కేంద్రం తెలిపిందన్నారు. దీంతో వచ్చే యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవని మరోసారి మంత్రి స్పష్టం చేశారు. కేంద్రం కొనుగోలు చేయకపోతే.. రాష్ట్రం కొనుగోలు చేసే పరిస్థితి ఉండదని ఆయన తెలిపారు. పీయూష్ గోయల్‌ను కలిసిన సమయంలో రిక్వెస్ట్ చేస్తే ఆయన పట్టించుకోలేదని… లిఖిత పూర్వకంగా…
హైదరాబాద్ జలసౌధలో గురువారం సాయంత్రం కేఆర్ఎంబీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కృష్ణా నది పరివాహక ప్రాంత రాష్ట్రాల నీటిపారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం ఎడమగట్టు కాల్వ పనులను గెజిట్ నోటిఫికేషన్లో రెండుగా చూపడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు మరో లేఖ రాసింది. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా నదీ ఆయకట్టును 3 నుంచి 4 లక్షల ఎకరాలకు పెంచారని, కానీ నీటి కేటాయింపులు పెంచలేదని…
రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1న దేశ వ్యాప్తంగా పదో విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను అన్నదాతల ఖాతాల్లో జమ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద కేంద్రం ప్రతి ఏడాది రైతుల అకౌంట్లలో మూడు విడతలుగా రూ.6 వేలు జమ చేస్తోంది. దీని వల్ల దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. జనవరి 1, 2022న మధ్యాహ్నం 12 గంటలకు…
ప్రస్తుతం ఏ విషయం అయినా సోషల్ మీడియా ద్వారా క్షణాల్లో పాకిపోతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా డిసెంబర్ 31 వరకు భారత్ బంద్ అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వారం రోజులు లాక్డౌన్ విధించిందనే వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. Read Also: రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని కేంద్రప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్‌చెక్…
2021 ఏడాది మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే ఈ ఏడాది కరోనా వైరస్ తర్వాత ప్రజలు ఎక్కువ చర్చించుకున్నది… ఇబ్బంది పడింది పెట్రోల్ ధరల విషయంలోనే. ఎందుకంటే దేశంలో ఈ ఏడాది లీటర్ పెట్రోల్ ధర తొలిసారిగా రూ.100 దాటింది. ప్రస్తుతం దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇది రూ.100పైనే ఉంది. అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలకు దేశీయ సుంకాలు తోడవడంతో సామాన్యుడు పెట్రోల్ ధరల సుడిగుండంలో చిక్కుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర…
దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలో 293 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 17 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలను దృష్టిలో పెట్టుకొని కోవిడ్, ఒమిక్రాన్ కట్టడికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం మరోసారి సూచించింది. ఒమిక్రాన్ కట్టడిపై కేంద్రం అలర్ట్ అయింది. కేసుల పెరుగుదలపై రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, ఒమిక్రాన్ పట్ల అన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించింది. ఎక్కువ కేసులున్న కోవిడ్ క్లస్టర్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని,…
ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాల హ్యాక్‌పై కేంద్రం సీరియస్‌గా ఉందా ? సామాజిక మాధ్యమాల హ్యాకింగ్‌పై…యాంటీ సైబర్ క్రైమ్ బృందంతో…దర్యాప్తు చేయించనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీ పిల్లల ఖాతాలను…సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. తన పిల్లల ఇన్స్టాగ్రాం ఖాతాలను హ్యాక్ చేశారంటూ కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ చేసిన ఆరోపణలను కేంద్రం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజాలను నిగ్గు తేల్చేందుకు అడ్వాన్స్డ్ యాంటీ సైబర్ క్రైమ్ యూనిట్‌తో దర్యాప్తు చేయించనున్నట్లు సమాచారం. హ్యాకింగ్ గురించి…
తెలంగాణ లో యాసంగి వరి ధాన్యం కొనుగోలు అంశం తెల్చకుండా రాష్ట్ర సీఎం కేసీఆర్ బీజేపీ నేతలతో కేంద్ర మంత్రులు తిట్టిస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కు తెలంగాణ రైతులను దూరం చేయాలని కేంద్ర మంత్రులు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహించారు. ఈ వాన కాలంలో తెలంగాణ లో 62 లక్షల ఎకరాల్లో వరి పంట వచ్చిందని అన్నారు. కానీ తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వం కేవలం 60 లక్షల టన్నుల వరి ధాన్యం…
దేశంలో సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. శుద్ధి చేసిన పామాయిల్‌పై విధించే ప్రాథమిక కస్టమ్స్ దిగుమతి సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.3 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సీబీసీఐసీ తాజాగా విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. దీంతో పామాయిల్ ధరలు తగ్గనున్నాయి. ట్రేడర్లు లైసెన్స్ లేకుండానే పామాయిల్ దిగుమతి చేసుకోవచ్చని పేర్కొంది. దీంతో ఆర్బీడీ పామ్ ఆయిల్, ఆర్బీడీ పామోలిన్ వంటి వాటిని లైనెన్స్ లేకుండానే దిగుమతి చేసుకోవచ్చని తెలిపింది. Read…