దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. అయితే మాస్కులు ధరించే విషయంలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ఐదేళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు కలిగిన చిన్నారులకు మాస్క్ తప్పనిసరి కాదని కేంద్రం స్పష్టం చేసింది. తల్లిదండ్రుల ప్రత్యక్ష పర్యవేక్షణ సమయంలో మాత్రమే ఆరేళ్ల నుంచి 11 ఏళ్ల వయస్సు పిల్లలు మాత్రమే మాస్క్ ధరించేలా చూడాలని సూచించింది. ప్రతి…
సెంట్రల్ విస్టా పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తోంది. ఈ కొత్త పార్లమెంటు నిర్మాణ పనులను టాటా ప్రాజెక్ట్స్ సంస్థ చేపట్టింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు కూతవేటు దూరంలో 13 ఎకరాల స్థలంలో పార్లమెంట్ భవనాల నిర్మాణం జరుగుతోంది. 2020 డిసెంబరులో ఈ భవనాల నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఆ సమయంలో ఈ ప్రాజెక్టు బడ్జెట్ రూ.977 కోట్లుగా ఉంది. అయితే ఏడాది గడిచే లోపే బడ్జెట్ భారీగా పెరిగింది. ఏకంగా 29…
ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎల్కతుర్తి -సిద్ధిపేట (ఎన్-765 డి.జి) రోడ్డు విస్తరణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేసిన కృషి ఫలించింది. ఈ రోడ్డు విస్తరణ పనులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక, సాంకేతిక పరమైన అనుమతులకు ఆమోదం తెలపడంతో పాటు రూ.578.85 కోట్లను మంజూరు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా ఎన్ హెచ్-765 డి.జి…
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అటు ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు బీభత్సమైన రీతిలో నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన రాకపోకలపై విధించిన నిషేధాన్ని మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి నెలాఖరు వరకు షెడ్యూల్డ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ప్యాసింజర్ సర్వీసులపై నిషేధం ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బుధవారం వెల్లడించింది. Read…
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ అందించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 26న ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరిగే వేడుకల్లో తెలుగు రాష్ట్రాల శకటాలకు ఈ ఏడాది స్థానం దక్కలేదు. ఈసారి గణతంత్ర వేడుకలకు మొత్తం 12 రాష్ట్రాలు, 9 శాఖలకు చెందిన శకటాలే రిపబ్లిక్ డే కవాతులో పాలుపంచుకోనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మేఘాలయా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన శకటాలే…
కేంద్ర పొగాకు బోర్డు సభ్యుడిగా బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఎన్నికయ్యారు. గత ఏడాది డిసెంబరు 14న జరిగిన రాజ్యసభ సమావేశంలో ఆమోదించిన తీర్మానం మేరకు ఈ ఎన్నిక జరిగింది. ఈ విషయాన్ని రాజ్యసభ సెక్రటేరియట్ లిఖితపూర్వకంగా జీవీఎల్కు తెలియజేసింది. పొగాకు బోర్డు చట్టం 1975లోని సెక్షన్ 4(4)(బి)తో పాటు పొగాకు బోర్డ్ రూల్స్, 1976లోని రూల్ 4(1) ప్రకారం… పొగాకు బోర్డు సభ్యునిగా ఒక రాజ్యసభ సభ్యుడిని హౌస్ సభ్యుల ద్వారా ఎన్నుకుంటారు. Read…
కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని మంత్రి జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం నల్లడబ్బు వెలికి తీయడం కాదు.. ప్రజల జేబులకు చిల్లులు పెడుతుందన్నారు. బీజేపీ ఏలుబడిలో అదానీలు, అంబానీలు పెరుగుతున్నారన్నారు. పేదలు మాత్రం మరింత పేదలుగా మారుతున్నారన్నారు. Read Also: కేఆర్ఎంబీ చైర్మన్కు తెలంగాణ ప్రభుత్వం లేఖ దొంగ చాటున రైతు చట్టాలను అమలు చేసేందుకు మోడీ సర్కార్…
కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శల దాడులకు దిగారు. గురువారం శంకర్పల్లిలోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అదానీ, అంబానీల రుణాల మాఫీ కోసమే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందంటూ ధ్వజమెత్తారు. రైతుల మేలు కోరి తెలంగాణలో ఎన్నో రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తుందన్నారు. మూడు నెలల కాలంలో 50 శాతం ఎరువుల ధరలు పెంచి…
కేసీఆర్కు జైలుకు వెళ్తే దేశమే భగ్గుమంటుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీని తీవ్ర స్తాయిలో విమర్శించారు. మా విధానాలు దేశానికి ఆదర్శం ఎందరో ఇతర రాష్ట్రాల ప్రతనిధులు మా విధానాలపై పరిశీలనకు వచ్చారు. ఐక్యరాజ్యసమితి లాంటి పెద్ద సంస్థలు కూడా తెలంగాణ అభివృద్ధి విధానాలు భేష్ అని కితాబిచ్చాయన్నారు. మీరు అధికారంలో లేనంత మాత్రానా మంచిగా పరిపాలనా చేసే వారిపై నిందలు వేయొద్దని, కేసీఆర్కు ఏమైనా అయితే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాలపై ఢిల్లీ నుండి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర విభజన అంశాలకు సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డా.సమీర్ శర్మ, తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్లతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రధానంగా 8 అంశాలపైనే చర్చ జరిగింది. 1)…