తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో దూసుకుపోతుంటే.. కేంద్ర ప్రభుత్వం పైసా నిధులివ్వడంలేదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేవలం మాటలు, ప్రశంసలతోనే కేంద్రం కాలం వెళ్లదీస్తుందన్నారు. పైగా రాష్ట్రాల విషయాలలో అడ్డుతగులుతుందని ఆరోపించారు. ఐఎఎస్, ఐపీఎస్,ఐఎఫ్‌ఎస్ అధికారులు స్వేచ్ఛగా పని చేయకుండా,సర్వీసు రూల్స్‌ను సవరిస్తున్నారన్నారు. రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరించే ప్రయత్నాలు చేస్తుందని వ్యాఖ్యానించారు. Read Also: పేద బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదువు కోవద్దా..?…
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా పార్లమెంట్ ఉభయ సభలను వేర్వేరు సమయాల్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉ. 10 గంటల నుంచి సా. 3 గంటల వరకు రాజ్యసభ, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్‌సభ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం బులిటెన్ విడుదల చేసింది. ఫిబ్రవరి…
ఆల్ ఇండియా సర్వీసెస్ (క్యాడర్) రూల్స్ (1954) సవరణ పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు.కేంద్రం చేపట్టిన ఆల్ ఇండియా సర్వీసెస్ (క్యాడర్) రూల్స్ 1954 ప్రతిపాదిత సవరణలు ఏ రకంగా చూసినా రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్దమని లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. ఈ సవరణలు ఐఏఎస్, ఐపీఎస్ మరియు ఐఎఫ్ఎస్ ల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసే విధంగా ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర…
బీజేపీ ప్రభుత్వ అకృత్యాల పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు. లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న సింగరేణి సంస్థను అమ్మేయాలనే కుట్ర బీజేపీ చేస్తుందన్నారు. తెలంగాణ అభివృద్ధికి గొడ్డలిపెట్టులా సింగరేణి సంస్థను అమ్మేసే ప్రయత్నం చేస్తుందన్నారు. లాభాల్లో నడిచే సంస్థలను ప్రవేట్ పరం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. కేంద్రం నిర్ణయాన్ని సింగరేణి కార్మికులు తీవ్రంగా…
తెలంగాణకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలంటూ మంత్రి హరీష్‌రావు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లను విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు.గతంలో చేసిన అభ్యర్థనలను ఈ లేఖలో గుర్తు చేశారు మంత్రి హరీష్ రావు. A.P. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94 (2) ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో రెండేండ్ల బకాయి రూ.900…
ఇటీవల కాలంలో దేశంలో వరుసగా ప్రభుత్వ అధికారులకు సంబంధించిన ట్విట్టర్ ఖాతాలు హ్యాకర్ల బారిన పడుతున్నాయి. తాజాగా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ శనివారం అర్ధరాత్రి హ్యాకింగ్‌కు గురైంది. దీంతో సాంకేతిక నిపుణులు ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎన్డీఆర్ఎఫ్ డీజీ తెలిపారు. దేశంలో ప్రకృతి విపత్తులు సంభవిస్తే సాయం చేయడం కోసం ఎన్డీఆర్ఎఫ్ పనిచేస్తోంది. ఈ నెల 19నే ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. Read Also: తెలంగాణకు కేంద్రం…
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో భాగంగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మరో అడుగు ముందుకు వేసింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ ఆపాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని గత కొన్ని రోజులుగా కోరుతున్నారు. అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన బాట పట్టిన సంగతి తెల్సిందే.. ఈ ఉద్యమానికి రాజకీయ పార్టీలు సైతం మద్దతునిస్తున్నాయి. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు మార్లు ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.…
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మరో శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రానికి మరో నాలుగు జాతీయ రహదారులను మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిలో ఒక దాన్ని నాలుగేళ్ల కిందట, మిగతా మూడింటిని గతేడాది జాతీయ రహదారులుగా ఎంపిక చేసింది. మిగతా మూడింటిని గతేడాది జాతీయ రహదారులుగా ఎంపిక చేసింది. తాజాగా వాటి పనులు ప్రారంభించేందుకు అనుమతులను ఇచ్చింది. వీటికి టెండర్లు పిలిచేందుకు జాతీయ రహదారుల విభాగం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తుంది. Read Also:…
కేంద్రంపై మరో పోరాటానికి రెడీ అవుతోంది టీఆర్ఎస్ పార్టీ… పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో దూకుడు పెంచాలని అధిష్టానం నిర్ణయించింది. కేంద్ర వైఖరిపై గట్టిగా పోరాడాలని సిగ్నల్స్ రావడంతో… ఆ దిశగా కసరత్తు మొదలు పెట్టారు టీఆర్ఎస్ ఎంపీలు. ఈ నెల 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి... దాంతో గులాబీ పార్టీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు మొదలుపెట్టింది. విభజన చట్టం అమలు, పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై పార్లమెంట్ వేదికగా…
భారతదేశ ఇంధన భద్రతకోసం దేశీయంగా చమురు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మాట్లాడారు. పెట్రోకెమికల్ రంగంలో పరిశోధన, అభివృద్ధి(ఆర్&డీ)కి మరింత ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పెట్రోలియం రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధికి మరింత కృషి జరగాలని దానికి ప్రభుత్వాలు కృషి చేయాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. Read Also: కేంద్రం మీద నెపం నెట్టి.. గిరిజన ఓట్లు లాక్కునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నం: రాములునాయక్ పరిశ్రమలు, విశ్వవిద్యాలయాల…