ప్రభుత్వం అన్నింటినీ జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తోంది.. కొన్ని శ్లాబుల్లో జీఎస్టీని సవరిస్తూ వస్తున్నారు.. ఇప్పటి వరకు మినహాయింపు ఉన్నవాటిని కూడా క్రమంగా జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తున్నారు.. ఇక, ఆన్లైన్లో బుక్ చేసుకునే ఆటో రైడ్లపై 5 శాతం జీఎస్టీ విధించనున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించగా.. అవి జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి.. ఓలా, ఉబర్ వంటి యాప్ అగ్రిగేటర్ల ద్వారా బుక్ చేసుకునే ఆటో రిక్షా రైడ్లు కూడా కొత్త సంవత్సరంలో మరింత ఖరీదుగా…
దేశం లోని రైతులందరికీ ప్రధాని మోడీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. నూతన సంవత్సరం సందర్భంగా.. అంటే జనవరి 1 వ తేదీన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను రైతుల ఖాతల్లో విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు తొమ్మిది విడతల్లో..పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులను విడుదల చేసినట్లు… జనవరి 1వ తేదీ నుంచి పదో విడత డబ్బులు కూడా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది Read Also:రాష్ర్టానికి అమూల్…
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి కేంద్ర ప్రభుత్వం కొత్త సంవత్సర కానుక పంపింది.. రాజమండ్రికి ఔటర్ రింగ్ రోడ్ మంజూరు చేసింది కేంద్ర సర్కార్.. ఈ విషయాన్ని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ వెల్లడించారు.. కేంద్రం ఉత్తర్వులపై ఆనందాన్ని వ్యక్తం చేసిన ఆయన.. ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేశారు.. రాజమండ్రి అభివృద్ధికి కేంద్రం న్యూ ఇయర్ కానుక ఇచ్చిందన్నారు.. రాజమండ్రికి ఔటర్ రింగ్ రోడ్ మంజూరైంది.. కేంద్ర ఉపరితల రవాణా శాఖ నుంచి ఉత్తర్వులు…
జనవరి 3 నుంచి 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వారికి కరోనా వ్యాక్సిన్ ఇస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీనేజర్లకు వ్యాక్సిన్ అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. 15 నుంచి 18 ఏళ్ల వయసు వాళ్లు జనవరి 1 నుంచి కోవిన్ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చని సూచించింది. దీని కోసం చిన్నారులు విద్యాసంస్థల ఐడీ కార్డులను కూడా రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగించవచ్చని తెలిపింది. వీళ్లు తప్పనిసరిగా…
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. మరోవైపు న్యూ ఇయర్ వేడుకలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన కరోనా ఆంక్షలను దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రకటించింది. అన్ని రాష్ట్రాలలో తప్పనిసరిగా కరోనా నిబంధనలను అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కావాలంటే సీఆర్పీసీ 144 సెక్షన్‌లోని నిబంధనలను రాష్ట్రాలు ఉపయోగించవచ్చని సూచించింది. Read Also: రాజన్న…
దేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నాం.రాష్ర్టంపై కేంద్రం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తుంది. రైతాంగం నడ్డి విరిచే చట్టాలను తీసుకొచ్చారు. 700 మంది మరణించిన తర్వాత ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం పార్లమెంట్లో చర్చ లేకుండానే చట్టాలను ఉపసంహరించుకున్నారు. ఎవరిని ఉద్ధరించడానికి ఇవ్వన్ని చేస్తున్నారు. ఎలక్షన్ లు వస్తున్నాయి వెనక్కి తీసుకున్నారా…
నాగాలాండ్ నుంచి AFSPA (ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్) ఉపసంహరణ అంశాన్ని పరిశీలించడానికి కేంద్ర హోం శాఖ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆదివారం ఆమోదం తెలిపారు. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ)రద్దు అంశంపై కేంద్రం ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. డిసెంబర్ 23న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలోఈ కమిటీ ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో నాగాలాండ్…
వానాకాలంలో పండిన ప్రతి గింజ కొనాల్సిందేనని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాజ్యాంగ హక్కు ప్రకారం కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రాల అవసరాలకు పోను.. మిగిలిన బియ్యాన్ని కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఆయన గుర్తు చేశారు. కేంద్రం మాటమారుస్తోందని, కేంద్రంపై నమ్మకం లేదని బియ్యం కొంటామని రాత పూర్వకంగా హామీ ఇవ్వాలన్నారు. పండిన ప్రతిగింజను కూడా కొనాల్సిందేనని మంత్రి గంగుల స్పష్టం చేశారు. కేంద్రం నుంచి సానుకూల స్పందన కోసం…
దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో కరోనా బూస్టర్ డోస్ వేసుకుంటే సురక్షితంగా ఉండొచ్చని పలు అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోని కొన్ని దేశాలు బూస్టర్ డోస్ ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాయి. భారత్‌లోనూ త్వరలో బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. తొలుత హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్లకు బూస్టర్ డోస్ ఇస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. హెల్త్ వర్కర్లకు బూస్టర్ డోస్ ఇచ్చిన తర్వాతే సామాన్యులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. Read Also: రూపాయి విలువ తగ్గడానికి…
తెలంగాణ రైతులను కేంద్రం అవమానిస్తుందని టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటికీ క్షమించరన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ఒకటి రెండు రోజుల్లో కేంద్రంస్పష్టత ఇవ్వాలన్నారు. రైతులతో రాజకీయం చేస్తున్నారు. “ఆహార భద్రత చట్టం” కింద దేశంలో ధాన్యం సేకరించడం కేంద్రం భాద్యత అని అన్నారు. భారత్ లో తెలంగాణ లేదా..? తెలంగాణ రైతులు భారత దేశ రైతులు…