అంతర్జాతీయ విమానాలపై నిషేధం మరోసారి పొడిగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అటు ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు బీభత్సమైన రీతిలో నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన రాకపోకలపై విధించిన నిషేధాన్ని మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి నెలాఖరు వరకు షెడ్యూల్డ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ప్యాసింజర్ సర్వీసులపై నిషేధం ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బుధవారం వెల్లడించింది.
Read Also: గోవా అసెంబ్లీ పోల్.. సీఎం అభ్యర్థిని ప్రకటించిన కేజ్రీవాల్
Also Read
- BJPలో చేరిన రాఘవ్ చడ్డాకు ఓటర్ లిస్ట్ షాక్.. పంజాబ్ ఓటర్ లిస్ట్‌లో పేరు మాయం!
- Abhinandan Varthaman: పాక్ F-16ను కూల్చిన వీరుడు.. IAFకు గుడ్‌బై చెప్పిన అభినందన్! గోవాలో కొత్త ఇన్నింగ్స్..
- Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్‌పై భారత్ ఆగ్రహం..
గతంలో అంతర్జాతీయ విమానాలపై జనవరి 31 వరకు కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించగా… తాజాగా ఆ నిషేధాన్ని మరోసారి పొడిగించింది. అయితే ఎయిర్ బబూల్ అగ్రిమెంట్స్, మిషన్ వందే భారత్ విమానాలు, ఎయిర్ కార్గో విమానాలకు మాత్రం మినహాయింపు ఉంటుందని డీజీసీఏ స్పష్టం చేసింది. కాగా తొలిసారిగా కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను మార్చి 23, 2020 నుంచి నిలిపివేయగా… ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ ప్రకారం జూలై 2020 నుంచి కొన్ని విమానాలను నడుపుతున్నారు. ఎయిర్ బబుల్ మేనేజ్‌మెంట్ పాటిస్తున్న దేశాల్లో భారత్, అమెరికా, బ్రిటన్, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ దేశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Bethlehem Kudumba Unit : ‘బెత్లెహం కుడుంబ యూనిట్’ తెలుగు విడుదలకు అడ్డంకి
-
Nara Lokesh: వాయిదాపడే ప్రసక్తే లేదు.. స్థానిక ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలి!
-
Konda Surekha: కొండా సురేఖకు మంత్రి పదవి నుంచి ఉద్వాసన.. కీలక పదవుల్లో కొత్త నియామకాలు.!
-
ED Raids: దక్షిణాదిలో 30 చోట్ల ఏకకాలంలో తనిఖీలు.. గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడీ సోదాలు.!
-
Kamal : సిద్ధా’ డైరెక్టర్‌తో కమల్ హాసన్ పవర్ ప్యాక్డ్ ప్రాజెక్ట్..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!