తెలుగు రాష్ట్రాలకు నిరాశ.. రిపబ్లిక్ డే వేడుకల్లో దక్కని చోటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ అందించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 26న ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరిగే వేడుకల్లో తెలుగు రాష్ట్రాల శకటాలకు ఈ ఏడాది స్థానం దక్కలేదు. ఈసారి గణతంత్ర వేడుకలకు మొత్తం 12 రాష్ట్రాలు, 9 శాఖలకు చెందిన శకటాలే రిపబ్లిక్ డే కవాతులో పాలుపంచుకోనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మేఘాలయా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన శకటాలే రిపబ్లిక్ డే వేడుకల్లో కవాతు చేస్తాయని కేంద్ర రక్షణశాఖ తెలిపింది.
Read Also: 3 వారాల్లో గరిష్ట స్థాయికి కరోనా.. తాజా రీసెర్చ్ వార్నింగ్
Also Read
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
- Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
మరోవైపు విద్య-నైపుణ్యాభివృద్ధి, పౌర విమానయానం, న్యాయశాఖ సహా మొత్తం 9 శాఖలకు చెందిన శకటాలు రిపబ్లిక్ డే ప్రదర్శనల్లో పాల్గొననున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన అమృతోత్సవాల థీమ్‌తో కూడిన అంశాలను ఈ శకటాలు ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది రిపబ్లిక్ వేడుకల్లో కవాతు ప్రారంభమయ్యే సమయాన్ని ఉదయం 10 గంటలక బదులు 10:30 గంటలకు మార్చినట్లు అధికారులు వెల్లడించారు. మంచు కమ్మేసే అవకాశం ఉన్నందున ఈ మార్పు చేసినట్లు వివరించారు. ఈ ఏడాది ఫ్లైపాస్ట్‌లో విమానాలు, హెలికాప్టర్లు 15 విభిన్న భంగిమల్లో ఎగిరి కనువిందు చేయనున్నాయి.
తాజావార్తలు
-
Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం… 7 రోజులు దాటితే యాక్షన్
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?