కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ మరో రికార్డు సృష్టించింది. గత ఏడాది జనవరిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా… ఇప్పటివరకు 165 కోట్ల డోసులను పంపిణీ చేశారు. దేశంలో 75 శాతానికి పైగా జనాభాకు రెండు డోసుల వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. అందరి కృషితో కరోనాను ఓడిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై…
హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ఎందుకంటే ఈ హైవేను సూపర్ ఇన్ఫర్‌మేషన్ రహదారిగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైదరాబాద్-బెంగళూరు హైవే సూపర్ హైవేగా వాహనదారులకు సేవలు అందించనుంది. కేంద్రం తాజా నిర్ణయంతో ఒకవేళ మీరు ట్రాఫిక్‌లో చిక్కుకుంటే.. ఆ ప్రాంతం నుంచి బయటపడేందుకు ఎంత సమయం పడుతుంది?, ఎక్కడెక్కడ పెట్రోల్ బంకులు ఉన్నాయి?, ఆస్పత్రులు ఎంత దూరంలో ఉన్నాయి? వంటి కీలక సమాచారాలను డిజిటల్ బోర్డుల రూపంలో హైవే…
సోమవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం చేయనున్నారు. రాష్ట్రపతి హోదాలో పార్లమెంట్‌లో రామ్‌నాథ్ కోవింద్‌కు ఇదే చివరి ప్రసంగం కానుంది. ఎందుకంటే ఈ ఏడాది జూలైతో రాష్ట్రపతిగా ఆయన పదవీకాలం ముగియనుంది. రాష్ట్రపతి ప్రసంగం ముగిసిన అనంతరం.. లోక్‌సభ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక…
దమ్ముంటే ఢిల్లీలో బిలియన్ మార్చ్ పెట్టు బండి సంజయ్..హైద్రాబాద్ గల్లీలో కాదని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై నిప్పులు చెరిగారు. ఢీల్లీలో పోరాటం చేస్తే దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు తరలి వచ్చి పోరాటం చేస్తారని హరీష్ రావు అన్నారు. ఉద్యోగాలు.. ఉద్యోగాలు అని బీజేపీ నేతలు దొంగ జపం చేస్తున్నారు. దొంగే దొంగ అంటున్నారని అసలు…
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. 2017లోనే ఇజ్రాయెల్‌తో భారత ప్రభుత్వం డీల్ జరిగిందని న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది. క్షిపణి వ్యవస్థతో పాటు స్పైవేర్ పెగాసస్‌ను 200 కోట్ల డాలర్లతో భారత్ కొనుగోలు చేసిందని ఆరోపించింది. కొందరు జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు, రాజకీయనాయకులపై కొన్ని దేశాల ప్రభుత్వాలు పెగాసస్‌తో నిఘా పెట్టాయన్న కథనాలు గత ఏడాది సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజా ఆరోపణలతో మరోసారి ఈ…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అదనపు అప్పు పొందేందుకు అనుమతి ఇచ్చింది కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్.. కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలను అమలు చేసినందుకు గానూ ఆంధ్రప్రదేశ్‌తో పాటు రాజస్థాన్‌కు కూడా అదనపు అప్పుల పరిమితి పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది.. రెండు రాష్ట్రాలకు కలిపి రూ.7,309 కోట్ల అదనపు అప్పులు తీసుకునేందుకు పర్మిషన్ ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,123 కోట్లు, రాజస్థాన్‌కు రూ.5,186 కోట్లు అదనపు అప్పుల పరిమితి పెంచుతున్నట్లు పేర్కొంది. 2021-22…
జాతీయ పట్టణ ఉపాధిహామీ పథకాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో పట్టణీకీకరణ భారీ ఎత్తున పెరుగుతుందని, ఫలితంగా పట్టణ పేదరికం కూడా పెరిగే అవకాశం ఉందని మంత్రి అన్నారు. పట్టణాలకు వచ్చే పేద ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు కోసం వారి ఆదాయ మార్గాలు పెంచాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉందన్నారు. పట్టణ పేద ప్రజలు కనీస అవసరాలను అందుకునేలా వారి ఉపాధి హామీ ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందని…
ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా నాలుగోసారి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో గత ఏడాది తరహాలో ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ బడ్జెట్‌నే ప్రవేశపెట్టనుంది. మరోవైపు బడ్జెట్‌ను చూడాలనుకునే వారి కోసం కేంద్ర ప్రభుత్వం యూనియన్ బడ్జెట్ అనే పేరుతో మొబైల్ యాప్‌ను రూపిందించింది. ఈ యూనియన్ బడ్జెట్ యాప్ ద్వారా బడ్జెట్ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.…
భారత్‌లో మరోసారి కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం దేశంలో 2,55,874 కరోనా కేసులు నమోదు కాగా.. బుధవారం మాత్రం 2,85,914 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కరోనా మరణాలు కూడా పెరిగాయి. మంగళవారం 614 మంది మృతి చెందగా… బుధవారం 665 మంది కరోనాతో మరణించారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,00,85,116కి చేరింది. కరోనా మరణాల సంఖ్య 4,91,127కి పెరిగింది.…
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ప్రకటించిన పద్మభూషణ్ పురస్కరాన్ని తిరస్కరిస్తున్నట్టు సీపీఎం సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య ప్రకటించారు. ఈ అవార్డు గురించి తనకు ఎవరూ చెప్పలేదని, ఒకవేళ నిజంగానే తనను పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసినట్టు అయితే దానిని తాను తిరస్కరిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వ వాదన మరోలా ఉంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి మంగళవారం ఉదయం ఈ అవార్డు విషయమై బుద్ధదేవ్…