ఎల్కతుర్తి – సిద్ధిపేట రోడ్డు విస్తరణ పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎల్కతుర్తి -సిద్ధిపేట (ఎన్-765 డి.జి) రోడ్డు విస్తరణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేసిన కృషి ఫలించింది. ఈ రోడ్డు విస్తరణ పనులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక, సాంకేతిక పరమైన అనుమతులకు ఆమోదం తెలపడంతో పాటు రూ.578.85 కోట్లను మంజూరు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఫలితంగా ఎన్ హెచ్-765 డి.జి పరిధిలోని ఎల్కతుర్తి-సిద్ధిపేట విస్తరణ పనుల్లో భాగంగా మొత్తం 63.641 కి.మీల ( 69/978 నుండి 133/619 వరకు) మేరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నారు. కేంద్రం అన్ని రకాల అనుమతులు తెలపడంతో ఇక పనులు మొదలు కావడమే మిగిలి ఉంది. ఈ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రెండు మేజర్ బ్రిడ్జిలను, 6 మైనర్ బ్రిడ్జిలను పునర్ నిర్మించనున్నారు. వీటితో పాటు కొత్తగా 1 మేజర్, 26 మైనర్ బ్రిడ్జిలను కూడా నిర్మించాల్సి ఉంటుంది.
Also Read
Read Also: దమ్ముంటే వనదేవతల జాతరకు వెయ్యికోట్లు తీసుకురా.. బండి సంజయ్‌పై ఎంపీ కవిత ఫైర్
వాస్తవానికి ఎల్కతుర్తి- సిద్ధిపేట విస్తరణ పనులు చేపట్టాలంటూ బండి సంజయ్ కుమార్ గత కొన్ని నెలలుగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిలో భాగంగానే పలుమార్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆ శాఖ ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఎల్కతుర్తి – సిద్ధిపేట విస్తరణ పనులకు కేంద్రం ఆమోదం తెలపడం పై హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలకు ఆయన ప్రత్యేకంగా క్రుతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందనడానికి ఈ రోడ్డు విస్తరణ పనులకు నిధుల మంజూరే నిదర్శనమని ఆయన అన్నారు. ఈ రోడ్డు విస్తరణ పనులు తొందరగా పూర్తయితే కరీంనగర్, సిద్ధిపేట తదితర ప్రాంతాల ప్రజల ప్రయాణ ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు ఆయా ప్రాంతాల అభివృద్ధికి మరిన్ని అవకాశాలు మెరుగుపడతాయని బండి సంజయ్ తెలిపారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?