తెలంగాణలో రైతులు పండించిన యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు తెలంగాణ వ్యాప్తంగా మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. టీఆర్ఎస్ చేపట్టే ఈ కార్యక్రమాలకు రైతులు, ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. రైతుల ధాన్యం కొనుగోలు అంశంపై ఏప్రిల్ 4న మండల కేంద్రాల్లో…
ధాన్యం సేకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం ఆగడం లేదు. టీఆర్ఎస్-బీజేపీ నేతల పరస్పర విమర్శలతో రాష్ట్రంలో వరి రాజకీయం వేడెక్కుతోంది. తెలంగాణ పాలిటిక్స్ మొత్తం వడ్ల చూట్టూనే తిరుగుతున్నాయి. ధాన్యం కొనాలంటూ పలుసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడంతో.. పోరాట కార్యాచరణను ఉధృతం చేయాలని నిర్ణయించింది టీఆర్ఎస్. ఈనెల 4 నుంచి 11 వరకు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. Read Also: Minister KTR : కిషన్…
దేశవ్యాప్తంగా ప్రజల జీవన విధానం మారుతోంది. ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. దీంతో ప్రజలు జబ్బుల బారిన పడుతున్నారు. ఏపీలో అయితే భారీగా రక్తపోటు, మధుమేహం బాధితులు పెరిగినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధ్యయనం స్పష్టం చేసింది. ప్రతి 100 మందిలో ఎవరో ఒకరు ఈ రెండింటిలో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్లు అధికారులు గుర్తించారు. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత రాష్ట్రాల వారీగా ప్రజల ఆరోగ్య వివరాలను తెలపాలని కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ…
నేటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కానుంది. దీంతో కొత్త నిబంధనలు కూడా అమల్లోకి రానున్నాయి. మరి ఆ రూల్స్ ఏంటి? అవి ప్రజలపై ఎలా ప్రభావితం చేస్తాయో వివరంగా తెలుసుకుందాం. పీఎఫ్ ఖాతాపై పన్ను: కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఐటీ నిబంధన (25వ సవరణ) 2021ను అమల్లోకి తీసుకువచ్చింది. దీంతో EPF ఖాతాలోకి వెళ్లే మొత్తాల్లో రూ.2.5 లక్షల వరకే పన్ను ఉండనుంది. ఇది దాటితే వడ్డీ ఆదాయంపై పన్ను వర్తిస్తుంది. క్రిప్టో…
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటాకు భారత రత్న అవార్డు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఓ వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జీవితాంతం అవిశ్రాంతంగా సేవలను అందిస్తున్న రతన్‌టాటా భారతరత్న అవార్డుకు అర్హుడంటూ సామాజిక కార్యకర్త రాకేష్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ పిటిషన్‌ను విచారించేందుకు హైకోర్టు తిరస్కరించింది. ఓ వ్యక్తికి దేశ అత్యున్నత అవార్డు భారతరత్న ఇవ్వాలని ప్రభుత్వ అధికారులను తాము ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అయినా అసలు…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసోం, మణిపూర్, నాగాలాండ్‌లో వివాదాస్పదంగా మారిన సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని కుదిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. AFSPA (ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్) పేరుతో ఈ చట్టాన్నిఈశాన్య రాష్ట్రాలలో తిరుగుబాటు దారుల అణిచివేత కోసం కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చింది. అయితే భద్రతా దళాలు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చట్టం పరిధిలోని ప్రాంతాలను…
ధాన్యం కొనుగోళ్ల విషయంలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆరోపణపర్వం కొనసాగుతూనే ఉంది… రాష్ట్రాలను కేంద్రం తప్పుబడుతుంటే.. తప్పంతా కేంద్రానిదే అంటున్నాయి తెలంగాణ సహా పలు రాష్ట్రాలు.. అయితే, ఈ నేపథ్యంలో బాయిల్డ్ రైస్‌పై మరోసారి తన విధానాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాల నుంచి బాయిల్డ్ రైస్ సేకరించేది లేదని లోక్‌సభలో స్పష్టం చేసింది కేంద్రం.. ఎంపీ దుష్వంత్ సింగ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ సహాయ మంత్రి సాధ్వి…
కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గత రెండేళ్లుగా దేశంలో టెలికాం ఆపరేటర్లు ప్రవేశపెట్టిన కాలర్ ట్యూన్లు ఎట్టకేలకు నిలిచిపోనున్నాయి. ఎప్పుడూ కాల్ చేసినా ‘కరోనాపై పోరాటంలో మనం పోరాడాల్సింది రోగితో కాదు వ్యాధితో’ అంటూ వినిపించే కాలర్ ట్యూన్లతో ప్రజలు విసిగెత్తిపోయారు. ఈ కాలర్‌ట్యూన్ సెల్‌ఫోన్ వినియోగదారులకు పలు సందర్భాల్లో చికాకు కూడా తెప్పించేది. అయితే ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో టెలికాం ఆపరేటర్లు ఈ కాలర్ ట్యూన్‌ను త్వరలో తొలగించనున్నారు. ఈ కాలర్ ట్యూన్ కారణంగా…
కరోనా సంక్షోభం కారణంగా గత రెండేళ్లుగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తాజాగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గిపోవడంతో అంతర్జాతీయ విమాన రాకపోకలపై ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. విమాన సిబ్బంది ఇకపై పీపీఈ కిట్లు ధరించాల్సిన అవసరం లేదని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే విమానాశ్రయాల్లో, విమానాల్లో ప్రయాణికులు, సిబ్బంది మాస్కులు ధరించడం తప్పనిసరి అని…
దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు వరుసగా ప్రైవేట్ పరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు మార్చి 28, 29 తేదీల్లో భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కూడా సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపింది. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి ముందుగా లావాదేవీలను పూర్తి చేసుకోవాలని సూచించింది. అటు భారత్ బంద్‌కు దేశంలోని పలు రంగాలకు చెందిన కార్మికులు కూడా…