రైతుల కోసం మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయానికి సంబంధించి ఈనెల 25 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా ప్రచారం చేపట్టాలని భావిస్తోంది. ఈ మేరకు ‘కిసాన్ భగీదారీ ప్రాథమిక హమారీ’ పేరిట ప్రచారాన్ని నిర్వహించాలని తలపెట్టింది. వ్యవసాయానికి సంబంధించిన అన్ని సంస్థలు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్నాయి. రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా ఈ ప్రచార కార్యక్రమం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దేశంలో ఉన్న 720 కృషి విజ్ఞాన…
నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ పదవి నుంచి రాజీవ్ కుమార్ వైదొలిగిన సంగతి తెలిసిన విషయమే. ఐదేళ్ల క్రితం నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్గా నియమితులైన రాజీవ్ కుమార్ శుక్రవారం రాజీనామా చేశారు. దీంతో రాజీవ్ కుమార్ స్థానంలో సుమన్ బెరీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. రాజీవ్ కుమార్ రాజీనామాను మంత్రివర్గం నియామకాల కమిటీ ఆమోదించిందని.. ఈ మేరకు ఆయన వారసుడిగా సుమన్ బెరీని నియమించినట్లు కేంద్ర మంత్రిత్వశాఖ వెల్లడించింది. మే 1 నుంచి సుమన్ బెరీ…
దేశంలో కరెంట్ కోతలపై కేంద్ర విద్యుత్ శాఖ కొత్త నిబంధనలు జారీ చేసింది. ఈ మేరకు లక్ష, అంతకు మించి జనాభా ఉండే పట్టణాల్లో డిస్కంలు 24 గంటల పాటు విద్యుత్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నిబంధనను తక్షణమే అమల్లోకి తెచ్చేలా ప్రతి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థలకు ఆదేశాలివ్వాలని స్పష్టం చేసింది. దేశంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో లక్షకు పైగా జనాభా ఉండే పట్టణాల్లో డీజిల్ జనరేటర్ల వినియోగాన్ని…
ప్రస్తుతం జీఎస్టీని నాలుగు శ్లాబులుగా వసూలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.. 5, 12, 18, 28 శాతం శ్లాబులు అమల్లో ఉన్నాయి.. రాష్ట్రాల ఆదాయాన్ని పెంపొందించేందుకు, జీఎస్టీ కౌన్సిల్ తన తదుపరి సమావేశంలో భారీ వినియోగంతో కూడిన కొన్ని వస్తువులను 5 శాతం శ్లాబ్ నుంచి 3 శాతం పెంచి 8 శాతం శ్లాబ్ను తెచ్చే అవకాశం ఉందని గతంలో కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. బంగారం మరియు ఆభరణాలపై 3 శాతం పన్ను రేటు ఉంటుంది.. ఇది…
ఇండియాలో కరోనా మహమ్మారి కారణంగా 40 లక్షల మంది మరణించారంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) చేసిన ప్రకటనను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. కరోనా వల్ల మృతిచెందిన వారి సంఖ్యను లెక్కించడానికి డబ్ల్యూహెచ్వో అనుసరించిన విధానాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రశ్నించింది. జనాభాలో, విస్తీర్ణంలో ఇంత పెద్ద దేశానికి ఒక గణిత నమూనాను ఫాలో కావడాన్ని తప్పుబట్టింది. తక్కువ జనాభా ఉన్న దేశాలకు అనుసరించిన విధానాన్నే భౌగోళికంగా, జనాభా పరంగా పెద్ద దేశమైన భారత్ విషయంలోనూ పాటించడం…
జాతీయ స్థాయిలో ఏపీ మరోసారి సత్తా చాటింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న రెండు పథకాలకు కేంద్ర నుంచి గుర్తింపు లభించింది. టెలీ కన్సల్టేషన్ ద్వారా వైద్య సేవలు అందించడంలో ముందున్న వైద్య ఆరోగ్యశాఖకు జాతీయస్థాయిలో తొలి ర్యాంకు లభించింది. ప్రతిరోజూ టెలీ కన్సల్టేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా 1.3 లక్షల మందికి వైద్య సేవలు అందుతున్నాయి. ఇందులో ఏపీకి సంబంధించి సుమారు 70వేల మందికి 27 హబ్స్లలో వైద్యుల నుంచి టెలీ కన్సల్టేషన్ ద్వారా…
దేశంలోని 14 రాష్ట్రాలకు రెవెన్యూలోటు గ్రాంటు కింద 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్రం రూ.7,183.42 కోట్ల నిధులను విడుదల చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈ రాష్ట్రాలన్నింటికీ రూ.86,201 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుందని లెక్కించి ఆ మొత్తాన్ని 12 సమాన వాయిదాల్లో ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సంఘం సూచించింది. అందులో తొలివిడత నిధులను శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెవెన్యూ లోటు కింద రూ.879.08 కోట్ల…
ఇప్పటికే పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తూ వస్తున్న తెలంగాణ మంత్రి కేటీఆర్.. వరుసగా పెరుగుతూ సామాన్యుడికి గుది బండగా మారిన పెట్రో ధరలపై గురు పెట్టారు.. పెట్రో ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ బహిరంగలేఖ రాశారు.. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని గప్పాలు చెప్పుకునే మోడీ గారి పాలనలో సబ్ కా సత్తేనాశ్ అయ్యిందని దుయ్యబట్టారు.. అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు పెరిగినా తగ్గినా దేశంలో రేట్లు పెంచడమే…
ఏపీలో ఇటీవల ప్రభుత్వం 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కొత్తగా ఏర్పాటు చేసిన 13 జిల్లాలతో కలిపి ఏపీలో జిల్లాల సంఖ్య 26కి చేరింది. అయితే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటు చేసిన 13 జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ (ఎల్జీడీ) కోడ్లను కేటాయించింది. పార్వతీపురం మన్యం జిల్లాకు 743, అనకాపల్లికి 744, అల్లూరి సీతారామరాజు జిల్లాకు 745, కాకినాడకు 746, కోనసీమకు 747, ఏలూరుకు 748, ఎన్టీఆర్ జిల్లాకు 749,…
ఏపీలో కొత్తగా 13 జిల్లాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొత్త జిల్లాల అంశాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ప్రతి జిల్లాలో ఓ కేంద్రీయ విద్యాలయం ఉండాలనే విషయాన్ని ఆయన రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఏపీలో ఏర్పడిన కొత్త జిల్లాలకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలను మంజూరు చేయాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర…