తెలంగాణ ప్రభుత్వం నిరుద్యొగుల పాలిట బంగారు హస్తం అయ్యింది. గత ఏడాది కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితుల ఎదురైన సంగతి తెలిసిందే..ఇప్పుడీప్పుడే రాష్ట్రం మళ్ళీ ఆర్థికంగా పుంజుకుంటున్న సంగతి తెలిసిందే..ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రవేట్ సంస్థలలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్. ఇప్పటికే ప్రముఖ కంపెనీలలో ఉన్న పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది..కొన్ని పోస్టులకు సంబంధించిన ఉద్యొగాలు భర్థీ అయ్యాయి. ఇప్పుడు మరో నోటిఫికేషన్…
దేశంలో అన్ని ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఒకవైపు పెట్రోల్ ధరలు.. మరోవైపు గ్యాస్ ధరలు సామాన్యులను ఉక్కిరి బిక్కిరి చేస్తుండగా ఇప్పుడు సీఎన్జీ గ్యాస్ ధరల వంతు వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో సీఎన్జీల ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కిలో సీఎన్జీపై రూ.2 చొప్పున భారం మోపింది. దీంతో ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర రూ.73.61కి చేరింది. అటు నోయిడాలో రూ.76.71,…
వేసవికాలం మొదలైనప్పటి నుంచి.. ఎలక్ట్రిక్ వెహికల్స్ వరుసగా తగలబడుతున్నాయి. మొదట్లో ఒకట్రెండు వాహనాల్లో మంటలొచ్చినప్పుడు.. ఎవరూ సీరియస్గా తీసుకోలేదు. కానీ, క్రమంగా ఈ స్కూటర్స్ ఎక్కువ సంఖ్యలో దగ్ధమవ్వడం మొదలైంది. ఒకట్రెండు ఘటనల్లో ప్రాణనష్టం కూడా జరిగింది. దీంతో.. అటు కంపెనీలు, ఇటు ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఎలక్ట్రిక్ వాహనాల లాంచింగ్ను ఆపేయాలని సూచించిన కేంద్రం.. ఈ ప్రమాదాలపై హైలైవెల్ విచారణ కమిటీని నియమించింది. దీంతో రంగంలోకి దిగిన ఆ కమిటీ.. అగ్ని ప్రమాదాలు జరిగిన చోట…
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నగదును కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో ఏడాదికి మూడు సార్లు జమ చేస్తుంది. ప్రతి రైతుకు రూ.2వేల చొప్పున ఏడాదికి మూడు సార్లు రూ.6వేల నగదును కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. అయితే ఈ పథకం అమలులో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా గతంలో కేవైసీ చేసుకున్న ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈ-కేవైసీ నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ–కేవైసీ పూర్తి చేసిన వారి ఖాతాల్లోఏ…
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా వంటనూనెల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. మరోవైపు ఇండోనేషియా వంటి దేశాలు పామాయిల్ దిగుమతులపై నిషేధం విధించడం కూడా వంటనూనెల ధరలకు రెక్కలు రావడానికి కారణమైంది. దీంతో మూడు నెలలుగా దాదాపు కిలో వంట నూనె ధర రూ.70 నుంచి రూ.100 పెరిగింది. అయితే త్వరలోనే వంట నూనెల ధరలు తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వంట నూనెల విషయంలో ఇండియా సుమారు 60 శాతం…
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు దేశవ్యాప్తంగా పలు శాఖలను మూసివేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది. కొన్నేళ్లు ఈ బ్యాంక్ ఒడిదొడుకులకు లోను కావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 13 శాతం బ్రాంచీలు అంటే దేశవ్యాప్తంగా సుమారు 600 బ్రాంచీలు మూతపడే అవకాశాలున్నాయి. ఒకవేళ శాఖలను మూసివేయడం…
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో భద్రతా చర్యలపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ సమీక్షించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలలో వాడుతున్న సీసీ కెమెరాల సంఖ్యను కేంద్ర హోంశాఖ పరిధిలోని పోలీస్ పరిశోధన అభివృద్ధి సంస్థ (బీపీఆర్డీ) వెల్లడించింది. 2021, జనవరి 1వ తేదీ నాటికి దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో 2,82,558 సీసీ కెమెరాలు ఉన్నట్లు తెలిపింది. అయితే పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో సీసీ కెమెరాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు బీపీఆర్డీ పేర్కొంది. ఏపీలో కేవలం 20,968 సీసీ…
దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గతనెలలో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. ఈ మేరకు 2022 ఏప్రిల్ నెలలో రూ.1.67 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైందని కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది. ఇది జీవితకాల గరిష్ఠమని తెలిపింది. ఇదే ఏడాది మార్చిలో వసూలైన రూ.1.42 లక్షల కోట్లు రెండో అత్యధికమని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. మార్చితో పోల్చితే ఏప్రిల్లో రూ.25వేల కోట్లు అధికంగా జీఎస్టీ రాబడి వచ్చిందని…
దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ అందించింది. ప్రపంచ వ్యాప్తంగా ఎరువుల ధరల పెరుగుతున్నా దేశంలో ఆ భారాన్ని రైతులపై పడనీయబోమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రైతులు కొనుగోలు చేసే డీఏపీ, పాస్పటిక్, పొటాషియం ఎరువులపై ఏకంగా 60 వేల కోట్ల సబ్సిడీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీఏపీ బస్తాపై ప్రస్తుతం ఉన్న రూ.1,850 సబ్సిడీని రూ.2,501కి పెంచింది. ఇది గత ఏడాది కంటే 50…
కరోనా పరిస్థితులపై అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పెట్రోల్ ధరలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ ధరలకు రాష్ట్ర ప్రభుత్వాల తీరే కారణమని మోదీ ఆరోపించారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించినా.. రాష్ట్రాలు తగ్గించలేదన్నారు. రాష్ట్రాల తీరు వల్లే ధరలు పెరుగుతున్నాయని మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో పెట్రోల్పై వ్యాట్ తగ్గించాలని.. అప్పుడే ప్రజలపై పెట్రోల్ ధరల…