జాతీయ స్థాయిలో ఏపీ మరోసారి సత్తా చాటింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న రెండు పథకాలకు కేంద్ర నుంచి గుర్తింపు లభించింది. టెలీ కన్సల్టేషన్ ద్వారా వైద్య సేవలు అందించడంలో ముందున్న వైద్య ఆరోగ్యశాఖకు జాతీయస్థాయిలో తొలి ర్యాంకు లభించింది. ప్రతిరోజూ టెలీ కన్సల్టేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా 1.3 లక్షల మందికి వైద్య సేవలు అందుతున్నాయి. ఇందులో ఏపీకి సంబంధించి సుమారు 70వేల మందికి 27 హబ్స్‌లలో వైద్యుల నుంచి టెలీ కన్సల్టేషన్ ద్వారా సలహాలు, సూచనలు అందుతున్నాయి.
దేశవ్యాప్తంగా టెలీ కన్సల్టేషన్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న రాష్ట్రాల జాబితాలో కర్ణాటక రెండో స్థానంలో ఉండగా… మధ్యప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కింద హెల్త్ అండ్ వెల్‌నెస్ కేంద్రాల నిర్వహణ కింద ఏపీకి ప్రశంసాపత్రం కూడా లభించింది. ఆజాద్ కా అమృత్ మహోత్సవ వేడుకల్లో భాగంగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రాల ప్రగతిని కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తోంది.
Metro Rail: విశాఖ వాసులకు శుభవార్త.. ఐదేళ్లలో మెట్రోరైల్ ప్రాజెక్ట్ పూర్తి