ఏపీలో కొత్తగా 13 జిల్లాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొత్త జిల్లాల అంశాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ప్రతి జిల్లాలో ఓ కేంద్రీయ విద్యాలయం ఉండాలనే విషయాన్ని ఆయన రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఏపీలో ఏర్పడిన కొత్త జిల్లాలకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలను మంజూరు చేయాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందని కూడా ఆయన పేర్కొన్నారు.
మరోవైపు ఏపీలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అత్యంత శాస్త్రీయంగా జరిగిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. 26 జిల్లాలలో ఒక్కో జిల్లా ఒక్కో ఆణిముత్యంలా అభివృద్ధిని నమోదు చేస్తాయని విజయసాయిరెడ్డి ఆకాంక్షించారు. నాలుగు జిల్లాలకు ఎన్టీఆర్, అల్లూరి, అన్నమయ్య, శ్రీసత్యసాయి పేరిట నామకరణం చేయడం ద్వారా సీఎం జగన్ వారిని చిరస్మరణీయులుగా చేశారని విజయసాయిరెడ్డి ప్రశంసించారు.
https://ntvtelugu.com/ambati-rambabu-slams-chadrababu-and-pawan/