శనివారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో గతంలో ప్రవేశపెట్టిన ఉచిత రేషన్ పథకాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ఈ నిర్ణయంతో ఈ ఏడాది సెప్టెంబర్ దాకా పేదలకు ఉచిత రేషన్ అందనుంది. ఈ పథకం కింద దేశంలోని 80 కోట్ల మందికి లబ్ధి చేకూరుతోంది. పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పేరిట కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా…
తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే నడుస్తున్న సైనిక్ స్కూళ్లకు అదనంగా మరో 21 సైనిక్ స్కూళ్ల ఏర్పాటుకు కేంద్ర రక్షణ శాఖ శనివారం ఆమోదం తెలిపింది. పీపీపీ పద్ధతిలో నడిచే ఈ కొత్త సైనిక్ స్కూళ్లలో 7 డే స్కూళ్లుగా పనిచేయనుండగా.. 14 మాత్రం రెసిడెన్షియల్ మోడ్లో నడవనున్నట్లు రక్షణ శాఖ ప్రకటన చేసింది. ఇక కొత్తగా ఏర్పాటు కానున్న 21 సైనిక్ స్కూళ్లలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కోటి చొప్పున…
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి దేశవ్యాప్తంగా కరోనా నిబంధనలను పూర్తిగా తొలగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు ప్రకటించింది. అయితే బహిరంగ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమాచారం ఇచ్చారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు గతంలో…
తెలంగాణ హైకోర్టుకు మరో 10 మంది న్యాయమూర్తులు రానున్నారు. కొత్తగా పది జడ్జీలను నియమిస్తూ… రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 1న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం… తెలంగాణ హైకోర్టుకు 12 మంది నూతన న్యాయమూర్తుల నియామకానికి సిఫారసు చేసింది. న్యాయవాదుల నుంచి ఏడుగురిని, జ్యుడిషియల్ ఆఫీసర్ల నుంచి ఐదుగురిని జడ్జిలుగా నియమించడానికి కొలీజియం నిర్ణయం తీసుకుంది. Read Also: Fuel Prices Hiked: వరుసగా రెండోరోజూ పెట్రో మంట.. కొత్త…
చైనా సహా పలు దేశాల్లో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో మన దేశంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ బూస్టర్ డోస్ ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది. ఇప్పటికే ఆరోగ్య సిబ్బందితో పాటు 60 ఏళ్లు నిండిన వారికి ప్రికాషనరీ డోస్ పేరుతో మూడో డోస్ను కేంద్రం సరఫరా చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో పలు ప్రాంతాలలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని బూస్టర్ డోసుల పరిధిని పెంచాలని ఆరోగ్యశాఖ…
ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రానికి ఏడు నూతన ఈఎస్ఐ ఆస్పత్రులను మంజూరు చేసింది. సోమవారం నాడు పార్లమెంట్లో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కొత్త ఈఎస్ఐ ఆస్పత్రుల వివరాల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించగా ఈ విషయాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విశాఖలో రూ.384.26 కోట్లతో సీపీడబ్ల్యూడీ శాఖతో నూతన ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మితం అవుతుందని.. విజయనగరంలో రూ.73.68 కోట్ల కేంద్ర నిధులతో MECON కంపెనీ ఆధ్వర్యంలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మితం అవుతుందని..…
దేశంలో కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుకోవాలంటే పాన్కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయించడం తప్పనిసరి. అయితే ఇంకా చాలా మంది పాన్-ఆధార్ లింక్ ప్రక్రియను పూర్తి చేయలేదు. ముఖ్యంగా పన్ను కట్టే వ్యాపారులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ పాన్, ఆధార్ లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాంటి వారు మార్చి 31 లోపు ఆధార్, పాన్ కార్డును లింక్ చేసుకోవాలని కేంద్రం సూచించింది. కరోనా కారణంగా ఆధార్, పాన్ లింక్ గడువు…
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్ వి వంటి వ్యాక్సిన్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే సీరం ఇనిస్టిట్యూట్ ఇఫ్ ఇండియా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య వ్యవధి తగ్గించాలని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధి 12 నుంచి 16 వారాలుగా ఉంది. అయితే ఈ వ్యవధిని 8 నుంచి 16 వారాలకు…
ఇక కరోనా మహమ్మారి పని అయిపోయింది.. థర్డ్ వేవ్ తర్వాత వినిపించిన మాటలు ఇవి.. మహమ్మారి పోదు.. కానీ, బలనహీనపడి.. సాధారణ స్వరంలా ఎటాక్ చేస్తుందని చెప్పిన పరిశోధనలు కూడా ఉన్నాయి.. అయితే, దేశంలో కరోనా మళ్లీ విజృంభించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. జనం అప్రమత్తంగా ఉండకపోతే… కోవిడ్ వ్యాపిస్తుందనే వార్తలు మళ్లీ అందరిలో ఆందోళన కలిగిస్తున్నాయి. స్టెల్త్ వేరియంట్ రూపంలో… ముప్పు పొంచి ఉందంటున్నారు. ఇండియాలో క్రమంగా కరోనా కేసులు తగ్గిపోతుండటంతో అందరూ ఇప్పుడిప్పుడే…
ఏపీలో గత మూడేళ్లుగా నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరుగుతున్నట్లు సోమవారం నాడు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి రామేశ్వర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీలో గత ఐదేళ్లలో 294 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు ఆయన వివరించారు. 2017లో 55 మంది, 2016లో 36 మంది, 2017లో 55 మంది, 2018లో 44 మంది, 2019లో 71 మంది, 2020లో 88 మంది ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. మరోవైపు తెలంగాణలో మాత్రం…