దేశంలోని 14 రాష్ట్రాలకు రెవెన్యూలోటు గ్రాంటు కింద 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్రం రూ.7,183.42 కోట్ల నిధులను విడుదల చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈ రాష్ట్రాలన్నింటికీ రూ.86,201 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుందని లెక్కించి ఆ మొత్తాన్ని 12 సమాన వాయిదాల్లో ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సంఘం సూచించింది. అందులో తొలివిడత నిధులను శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెవెన్యూ లోటు కింద రూ.879.08 కోట్ల నిధులు విడుదలను కేంద్ర ఆర్ధిక శాఖ విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది రాష్ట్రానికి మొత్తం రూ.10,549 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుందని ఆర్థిక సంఘం అంచనా వేసింది. మిగిలిన మొత్తాన్ని మరో 11 విడతల్లో విడుదల చేయనుందని ఆర్థిక సంఘం తెలిపింది. కాగా 14 రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం లేకపోవడంతో ఆ రాష్ట్రానికి కేంద్రం నిధులు విడుదల చేయలేదు.
https://ntvtelugu.com/ap-cm-ys-jagan-sensational-comments-on-opposition-leaders/