వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం 4 వేల కోట్ల రూపాయలు రెడీ చేసా.. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే.. సమస్య తీర్చేస్తా అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం 4 వేల కోట్లు రెడీ చేసి వచ్చాను.. కేంద్రం అనుమతి ఇస్తే.. సమస్య తొలగినట్టేనని పాల్ తెలిపారు.
Atal Pension Yojana : ప్రధాని మోదీ ప్రభుత్వ ప్రవేశ పెట్టిన ప్రతిష్టాత్మక పథకాల్లో ఒకటైన అటల్ పెన్షన్ యోజన చందాదారుల సంఖ్య 5 కోట్లు దాటింది. అదే సమయంలో ఈ పథకం టర్నోవర్ మొత్తం 28 వేల కోట్ల రూపాయలను దాటింది.
Unclaimed Deposits : దేశంలోని బ్యాంకుల్లో లెక్కకు మించి క్లెయిమ్ చేయని సొమ్ము నిలిచిపోయింది. వేల కోట్ల రూపాయలు దిక్కులేకుండా బ్యాంకుల్లో పడి ఉన్నాయి. ఈ మొత్తానికి యజమానులు లేకపోవడంతో సెంట్రల్ బ్యాంక్ (ఆర్బీఐ)తో పాటు కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఈ మొత్తానికి వారసులు ఎవరనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
భారత రిపబ్లిక్ డే వేడుకల పరేడ్ అద్భుతంగా ఉంటుందని అందరికి తెలిసిన విషయమే. ఢిల్లీ కర్తవ్యపథ్‌లో జరిగే పరేడ్‌లో భద్రతా బలగాలు, వివిధ రాష్ట్రాల శకటలు, ఆయుధ ప్రదర్శనలు సంగీత ప్రదర్శనలు కళ్లు తిప్పుకోకుండా సాగుతాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంది. అంతటి ప్రాధాన్యమున్న పరేడ్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ తాజా ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ఏపీ భవన్ భవనాలను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ కేంద్రం ప్రతిపాదించింది. అయితే.. తెలంగాణ విజ్ఞప్తికి పూర్తి భిన్నమైన ప్రతిపాదన చేయడం ఆసక్తి రేపుతోంది. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన అంశం దాదాపు కొలిక్కి వచ్చేసింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణ అధికారులతో పలుమార్లు సమావేశమైన కేంద్ర హోం శాఖ.. వాటికి సంబంధించిన మినిట్స్‌ను విడుదల చేసింది.
కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదని, కొవిడ్ కేసులపై నిఘా ఉంచాలని కేంద్రం 8 రాష్ట్రాలను కోరింది. డైలీ పాజిటివిటీ రేటు పెరుగుతున్న నేపథ్యంలో గమనించాలని కేంద్రం కోరింది.
బీజేపీ హఠావో-దేశ్ కీ బచావో అనే నినాదంతో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాచైతన్య యాత్ర నిర్వహిస్తోంది. చేర్యాల, కొమురవెళ్లి మండలాల్లో నిర్వహిస్తున్న ప్రజా చైతన్యయాత్రలో జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.