Wrestlers: కేంద్ర ప్రభుత్వానికి రెజ్లర్లు అల్టిమేటం.. అరెస్ట్ చేయకపోతే గంగలో పడేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుమారు నెలన్నర రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమకు న్యాయం చేయాలని నిరసనకు దిగిన రెజ్లర్లు తమ పోరాటాన్ని తీవ్రతరం చేశారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్నారు. బ్రిజ్ భూషణ్ పై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ రెజ్లర్లు సరికొత్త రీతిలో నిరసన చేపట్టాలని నిర్ణయించారు. ఇవాళ (మంగళవారం) ఉదయం చేసిన ప్రకటన ప్రకారం రెజ్లర్లు.. వినేష్ ఫోఘట్, సాక్షి మాలిక్, బజ్ రంగ్ పునియా తదితరులు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు చేరుకున్నారు. పతకాలను గంగానదిలో పడేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెజ్లర్లకు పోలీసులకు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Also Read : 2000Note: రూ.2000 నోట్ల రద్దు.. పిటిషన్ తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
తాము సాధించిన పతకాలకు ఎటువంటి అర్థం లేకుండా పోయిందని.. ఆ పతకాలను గంగానదిలో కలిపేస్తామని రెజ్లర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రెండ్రోజుల క్రితం పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా.. పార్లమెంట్ వైపు మార్చ్ తీసే క్రమంలో పోలీసులు.. రెజ్లర్లపై వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా వంటి రెజ్లర్లను పోలీసులు.. ఈడ్చుకెళ్లి పోలీసు వాహనాల్లో ఎక్కించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. అలాగే దీక్ష కోసం ఇకపై జంతర్ మంతర్ వద్దకు అనుమతించబోమని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
Also Read : Ambati Rambabu: టీడీపీ మోసాలకు పాల్పడే పార్టీ.. నన్ను ఓడించేందుకు కొత్త వస్తాదుల్ని తెస్తున్నారు
తమ పతకాలను గంగానదిలో పడేస్తామని వెళ్లిన రెజ్లర్లు ఇప్పుడా నిర్ణయంపై వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో హరిద్వార్‌లోని గంగానది ఒడ్డున హైడ్రామా కొనసాగింది. రైతు సంఘాల నేత నరేశ్ టికాయత్ హరిద్వార్‌కు చేరుకుని రెజ్లర్లను సముదాయించారు. వారి వద్ద నుంచి పతకాలను టికాయత్ తీసుకున్నారు. ఐదురోజులు వేచి ఉండాలని రెజ్లర్లకు టికాయత్ సూచించారు. ప్రభుత్వానికి రైతు సంఘాల నేతలు ఐదు రోజులు గడువిచ్చారు. అలా రైతు సంఘ నేతల సూచనలతో రెజర్లు ఆందోళన విరమించారు. కేంద్ర ప్రభుత్వానికి నలుగు రోజుల పాటు గడువు ఇచ్చారు. నరేశ్ టికాయత్‌తో చర్చల అనంతరం రెజ్లర్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!