Kavitha Announces New Political Party: తిరుమలకు కాలినడకన కవిత.. కొత్త పార్టీపై కీలక ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kavitha Announces New Political Party: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తిరుమలకు కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకోనున్నారు. తిరుపతిలోని అలిపిరి వద్ద నుంచి కాలినడకన తిరుమల బయల్దేరిన ఆమె.. ముందుగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. గత నాలుగేళ్లుగా చేయని తప్పుకు తాను మానసిక వేదన అనుభవించానని కవిత తెలిపారు. అయితే దేవుడి దయతో తనపై ఉన్న కేసును కోర్టు పూర్తిగా కొట్టివేసిందని చెప్పారు. ఆ కేసు నుంచి విముక్తి లభిస్తే కాలినడకన తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటానని మొక్కుకున్నానని, ఆ మొక్కును తీర్చుకోవడానికి ఇప్పుడు తిరుమలకు వచ్చానని వెల్లడించారు.
Read Also: Iran-India: ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాప పుస్తకంలో సంతకం
Also Read
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
అదే సమయంలో తెలంగాణ రాజకీయాల్లో కీలక ప్రకటన చేశారు కవిత. మరో రెండు నెలల్లో తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ పార్టీని స్థాపించనున్నట్లు చెప్పారు. కుల, మత, వర్గ భేదాలు లేకుండా ప్రజలకు సేవ చేసే పార్టీగా దీనిని తీర్చిదిద్దుతామని కవిత తెలిపారు. “తెలంగాణ ఫస్ట్” అనే నినాదంతో ప్రజల సమస్యలను మైక్రో లెవెల్‌లో పరిష్కరించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రను బీఆర్ఎస్ సరిగా నిర్వహించలేకపోయాయని ఆమె విమర్శించారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలపై తమకు ఎలాంటి ద్వేషం లేదని, రాజకీయ ఆధిపత్యాన్ని మాత్రమే వ్యతిరేకించామని కవిత స్పష్టం చేశారు. అలాగే హైడ్రా చర్యలపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. హైడ్రా పేదలను ఇబ్బంది పెట్టి పెద్దల కోసం పనిచేస్తోందని ఆరోపించారు. తాను ఎప్పుడూ పేదల పక్షాన నిలబడి పోరాడతానని కవిత అన్నారు. అలాగే తనకు న్యాయం చేసిన న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?