జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ఆగస్టు 2 నుంచి సుప్రీంకోర్టు విచారించనుంది. సోమ, శుక్రవారాలు మినహా మిగిలిన రోజుల్లో సోమ, శుక్రవారాలు మినహా మిగిలిన రోజుల్లో పిటిషన్లపై విచారణ ఉంటుంది.
BJP Leaders: తెలంగాణ బీజేపీలో కీలక నేతలుగా ఉన్న ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్‌లకు అదనపు భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సమాచారం.
కర్ణాటక హైకోర్టులో ట్విట్టర్ సంస్థకు షాక్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ట్విట్టర్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.
రాజకీయ పార్టీలు ఒక పార్టీపై మరొక పార్టీ విమర్శలు చేసుకోవడం సహజం. అలాగే రాజకీయ నాయకులు సైతం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. విమర్శలు చేసుకోవడమే కాదు.. ఒకరికి వ్యతిరేకంగా ఒకరు పోస్ట్‌లతో, కరపత్రాలతో ప్రచారం కూడా చేసుకుంటారు.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో కి వచ్చి నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది.జగన్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకం కాలేదు..దీంతో రావలసిన నిధుల విషయం లో మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం లభించింది.. విభజన హామీలు అమలు చేయకపోయినా కానీ ఎప్పటికప్పుడు నిధులిస్తూ వస్తుంది కేంద్రం.. ఇప్పుడు మరో విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం వినతిని అంగీకరించింది.ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు విద్యుత్ ను సరఫరా చేసేందుకు వీలుగా వేసిన విద్యుత్…
ఏపీలో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ పోలవరంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక ప్రకటన చేశారు. త్వరలో రూ. 12 వేల కోట్లకు పైగా నిధులు పోలవరం కోసం ఇవ్వబోతున్నట్టు వెల్లడించారు.పోలవరం నిర్మాణం కోసం రూ. 12, 911 వేల కోట్లను కేంద్రం ఇవ్వబోతోందని ఆయన తెలిపారు.
తమ పతకాలను గంగానదిలో పడేస్తామని వెళ్లిన రెజ్లర్లు ఇప్పుడా నిర్ణయంపై వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో హరిద్వార్‌లోని గంగానది ఒడ్డున హైడ్రామా కొనసాగింది. రైతు సంఘాల నేత నరేశ్ టికాయత్ హరిద్వార్‌కు చేరుకుని రెజ్లర్లను సముదాయించారు. వారి వద్ద నుంచి పతకాలను టికాయత్ తీసుకున్నారు. ఐదురోజులు వేచి ఉండాలని రెజ్లర్లకు టికాయత్ సూచించారు. ప్రభుత్వానికి రైతు సంఘాల నేతలు ఐదు రోజులు గడువిచ్చారు.