IAS, IPS Transfers : తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఐపీఎస్, ఐఏఎస్ బదిలీల అంశంలో కేంద్రం తెలంగాణ హైకోర్టుకు సూచన చేసింది. ఐపీఎస్, ఐఏఎస్ బదిలీల విచారణను అత్యవసరంగా చేపట్టాలని కోర్టును కేంద్రం కోరింది.
ట్విటర్లో కొన్ని ఖాతాలను బ్లాక్ చేయడానికి గల కారణాలను ఎందుకు చెప్పలేదని కర్ణాటక హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MEITY) వివిధ ఉపసంహరణ ఉత్తర్వులను సవాలు చేస్తూ ట్విట్టర్ ద్వారా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తున్న జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్ ధర్మాసనం ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది.
PAN And Aadhaar Link: కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డ్, ఆధార్ కార్డు లింకును పొడగించింది. మార్చి 31 వరకు పాన్, ఆధార్ లింక్ చేయాలని గతంలో కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దాన్ని జూన్ 30 వరకు పొగడించారు. ఇప్పటికే చాలాసార్లు కేంద్ర ఈ గడువును పొడగించింది. అయితే ఈ సారి గడువు ఉండదని ప్రకటించినప్పటికీ.. మరోసారి గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Aadhaar Bank Account Link : కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జనవరి 30న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది.
దేశంలో మళ్లీ కరోనా కలకలం రేగింది. కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రతిరోజు వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.
Central Funds: కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిన నిధులకు సంబంధించిన వివరాలను శాసన మండలిలో ప్రకటించారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధుల వివరాలను మండలిలో ప్రస్తావించారు.. 2023-24 వార్షిక బడ్జెట్ లో భాగంగా కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.41,338 కోట్ల కేటాయింపులు వచ్చాయని వెల్లడించారు. 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదించిన ప్రకారం, స్థానిక సంస్థలకు సంబంధించి రూ.8,077 కోట్లు కేటాయింపులు వచ్చాయని.. అయితే, కేంద్రం నుంచి…
National Retail Trade Policy: దేశవ్యాప్తంగా ఉన్న చిల్లర వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త జాతీయ విధానాన్ని రూపొందిస్తోంది. ఇప్పటికే ఉన్న పాలసీలో పలు మార్పులు చేర్పులు చేయనుంది. వ్యాపారాన్ని మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో ఈ జాతీయ రిటైల్ వాణిజ్య విధానాన్ని తీసుకురానుంది. దీంతో.. వర్తకులకు ఎంతో ప్రయోజనం కలగనుంది. మెరుగైన మౌలిక సదుపాయాలు, మరింత క్రెడిట్ పెరగనుంది. ఆన్లైన్ రిటైలర్లకు కూడా ఇ-కామర్స్ పాలసీని అందుబాటులోకి తీసుకురావాలని సెంట్రల్ గవర్నమెంట్ కృతనిశ్చయంతో ఉంది.