2014లో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసింది.. ప్రత్యేక హోదా విభజన హామీల అమలు సహా ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలేదు.. పోలవరం ప్రాజెక్టు అతి గతి లేని పరిస్థితి అయిందని ఏపీ పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు.
మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు అందించేందుకు.. అలానే వాళ్ళు రైతులకు అద్దె పద్ధతిలో డ్రోన్లను అందించి ఉపాధి పొందేలా స్కీమ్ ను రోపొందించింది కేంద్రం.
Medigadda Barrage: జయశంకర్ భూపాలపల్లి జిల్లా నిన్న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు మునిగిపోవడంతో కేంద్ర బృందం పరిశీలించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనిల్ జైన్ అధ్యక్షతన ఆరుగురు నిపుణులతో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విదేశీ వనరుల నుంచి విరాళాలను స్వీకరించేందుకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రానికి హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిందని శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఈరోజు తెలిపారు.
పండగ వేళ కేంద్ర ప్రభుత్వ, రైల్వే ఉద్యోగులతో పాటు అన్నదాతలకు కేంద్ర శుభవార్త తెలిపింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు సహా , రైల్వే ఉద్యోగులకు బోనస్, రబీ సీజన్లో ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంపు వంటి వాటికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
కేంద్రం ఇప్పటికే ఉన్న నాలుగు రాష్ట్రపతి శౌర్య పతకాలను తక్షణమే అమల్లోకి వచ్చేలా ఒకే పతకంగా విలీనం చేసింది. ఇప్పుడు అది 'ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ గ్యాలంటరీ'గా పిలవబడుతుంది.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరా రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 21న మంత్రాలయంలో నిర్వహించే సభకు రావాలని ఆహ్పానించామన్నారు.