Emergency Alert to Smart Phones: దేశ వ్యాప్తంగా కొంతమంది ఫోన్లు గురువారం రోజు కుయ్.. అంటూ మోగాయి. అయితే అది విన్న వెంటనే అసలు ఏం జరగుతుందో తెలియక చాలా మంది కంగారు పడ్డారు. ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు వచ్చిందో తెలియక అంతా అయోమయంలో పడ్డారు. దానిని చూస్తే తీవ్రమైన పరిస్థితి” అని అర్థం వచ్చేలా ఒక ఫ్లాష్ మెసేజ్ ఉంది. అయితే ఇది చూసి భయపడాల్సిన పని లేదు. దీనిని కేంద్రప్రభుత్వమే పంపింది.…
ఒక బ్లాక్బస్టర్ సినిమా నిర్మాణానికయ్యే బడ్జెట్ కంటే తక్కువ ఖర్చుతో చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టి అంతరిక్ష ప్రయోగాల్లో భారత కీర్తి పతాకాన్ని ఎగరేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు దండిగా నిధులు కేటాయించి ప్రోత్సహించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర సర్కార్ కు సూచించారు.
కేరళలో నిపా వైరస్ కలకలం రేపుతోంది. కోజికోడ్ జిల్లాలో నిపా వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. అదే జిల్లాలో మరో ఇద్దరికి కూడా ఈ వైరస్ సోకినట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని సీఐడీ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. లండన్ నుంచే చంద్రబాబు అరెస్టును సీఎం జగన్ మానిటరింగ్ చేస్తున్నాడు అని ఆయన అన్నారు.
PMLA Rules: పీఎంఎల్ఏ నిబంధనలను ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. బ్యాంకులు, స్టాక్ బ్రోకర్లు, బీమా సంస్థల వంటి సంస్థలకు బాధ్యతలను మరింత కఠినమైనదిగా చేయడానికి రెవెన్యూ శాఖ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నిబంధనలను కఠినతరం చేసింది.
15 కొత్త ప్రాజెక్టులకు (న్యూ లైన్స్ కోసం) ఫైనల్ లొకేషన్ సర్వే (FLS) కు కేంద్రప్రభుత్వం ఓకే చెప్పిందని పేర్కొన్నారు. దీంతోపాటుగా 8 డబ్లింగ్ లైన్లకు, 3 ట్రిప్లింగ్ లైన్లు, 4 క్వాడ్రప్లింగ్ లైన్లకు పచ్చజెండా ఊపిందని.. ఈ మొత్తం ప్రాజెక్టులకు ఫైనల్ లొకేషన్ సర్వే కోసం నిధులు మంజూరయ్యాయన్నారు. సర్వే పూర్తవగానే DPR ల పనులు ప్రారంభిస్తారని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్కు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం త్వరలో డియర్నెస్ అలవెన్స్ పెంపును ప్రకటించే అవకాశం ఉంది.
Rice Export To Singapore: దేశంలో ద్రవ్యోల్బణం పెరగడం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జూలై 20న బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దేశంలో ద్రవోల్బణాన్ని తగ్గించడం కోసం ఆహార నిల్వల పెంపుకోసమే ఇలా చేశామని అప్పట్లో మోదీ సర్కారు చెప్పుకొచ్చింది. అన్నపూర్ణగా భారతదేశం ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో ప్రపంచ వ్యాప్తంగా బియ్యం కొరత ఏర్పడి డిమాండ్ భారీగా పెరిగింది. ఎగుమతులు ఆపేయడంతో విదేశాల్లో ఉంటున్న భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
LPG Subsidy: కేంద్ర ప్రభుత్వం దేశంలో డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ ధరలపై సబ్సిడీని పెంచుతున్నట్లు 2023 ఆగస్టు 29న ప్రకటించింది. సాధారణ వంటగ్యాస్ వాడుతున్న కోట్లాది మంది వినియోగదారులకు ఈ ఉపశమనం లభించనుంది.
సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతుంది. వంటగ్యాస్ ధరలను రూ.200 వరకు తగ్గించాలని ఇప్పటికే మోడీ సర్కార్ నిర్ణయించింది. త్వరలో సిలిండర్పై రూ.200 తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించబోతోంది.