Central Funds: కేంద్రం నిధుల విడుదల.. ఏపీకి రూ.2,952 కోట్లు.. తెలంగాణకు 1,533 కోట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Funds: రాష్ట్రాలకు పన్నుల వాటా నిధులు విడుదల చేసింది కేంద్ర ఆర్థిక శాఖ.. అదనపు వాయిదా కింద మొత్తం 72,961.21 కోట్ల రూపాయలు విడుదల రిలీజ్ చేసింది.. నూతన సంవత్సరం, పండుగల నేపథ్యంలో సంక్షేమ, మౌలిక వసతుల కోసం నిధుల ముందుగానే విడుదల చేస్తున్నట్టు పేర్కొంది. రాబోయే ఉత్సవాలు మరియు నూతన సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని, వివిధ సాంఘిక సంక్షేమ చర్యలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకాలకు ఆర్థిక సహాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలను బలోపేతం చేస్తుందని.. దానికోసమే రూ. 72,961.21 కోట్ల అదనపు విడత పన్ను వితరణను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
Read Also: Lal Salaam : తలైవా నటించిన లాల్ సలాం మూవీ సంక్రాంతికి రానట్టేనా..?
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
రెండు విడతలు కలిపి డిసెంబర్‌లో కేంద్రం రూ.1.46 లక్షల కోట్లను రాష్ట్రాలకు బదిలీ చేసింది. ఇది 2023-24 సంవత్సరానికి రాష్ట్రాలకు పన్ను పంపిణీలో రెండవ రెట్టింపు విడత, మొదటిది జూన్‌లో వస్తుంది. ఎప్పటిలాగే, డిసెంబర్ 22 న బదిలీ చేయబడిన రూ. 72,961 కోట్లలో అత్యధిక మొత్తాన్ని రూ. 13,089 కోట్ల అందుకుంటున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇక, బీహార్ రూ. 7,338 కోట్లు విడుదల చేసింది కేంద్రం.. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 14 సమాన వాయిదాలలో రాష్ట్రాలకు పన్నుల పంపిణీని విడుదల చేస్తుంది. అందుకని, ఇది సాధారణ నెలవారీ మొత్తం కంటే రెట్టింపు ఇన్‌స్టాల్‌మెంట్ ఉన్న రెండు నెలలు ఉంటుంది. అయితే, ఈ రెండు-విడత నెలలు సాధారణంగా ఆర్థిక సంవత్సరం చివరిలో కేంద్రం తన ఆర్థిక విషయాలపై ఎక్కువ స్పష్టత ఇచ్చిన తర్వాత వస్తాయి. కానీ, ఆర్థిక స్థితి మంచి స్థితిలో ఉన్నందున, గత రెండేళ్లుగా ఈ అదనపు వాయిదాలను ముందే విడుదల చేసింది. ఇక, ఈ అదనపు వాయిదా కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2,952.74 కోట్ల రూపాయలు.. తెలంగాణకు 1,533.64 కోట్ల రూపాయలు విడుదల చేసింది కేంద్ర ఆర్థికశాఖ.
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!