కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇవాళ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేయనున్నారు. కేంద్రం పన్నులను బదిలీ చేయడం లేదని.. రాష్ట్రానికి ఆర్థిక సహాయం కూడా చేయడం లేదని వారు ఆరోపించారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కేరళకు చెందిన జైహింద్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛానెల్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ఛానెల్లో పెట్టిన పెట్టుబడుల వివరాలను ఇవ్వాలని సీబీఐ అధికారులు నోటీసులు పంపించింది.
సుకన్య సమృద్ధి యోజన, ప్రభుత్వ పొదుపు పథకం "బేటీ బచావో, బేటీ పడావో" చొరవలో కీలకమైన భాగం. ఆడపిల్లల ఉద్ధరణ, సాధికారతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాలపై కేంద్రంలోని మోడీ సర్కార్ దురుద్దేశంతో పని చేస్తోందని ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ అన్నారు. తమ ప్రభుత్వం ఆరోగ్యం, విద్యారంగంలో చేసిన పనులు నచ్చకపోవడం వల్లే ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన శకటాలకు అవకాశం ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు.
Central Government: ఎక్కడైనా ప్రభుత్వ వ్యవస్థల పనితీరు కొన్నిసార్లు విమర్శలకు దారి తీస్తుంది. ముఖ్యంగా మనదేశంలో ఏదైనా సరే పని అంత త్వరగా ఏమీ చేయలేమనే విమర్శలు వస్తుంటాయి.
రాష్ట్రాలకు పన్నుల వాటా నిధులు విడుదల చేసింది కేంద్ర ఆర్థిక శాఖ.. అదనపు వాయిదా కింద మొత్తం 72,961.21 కోట్ల రూపాయలు విడుదల రిలీజ్ చేసింది.. నూతన సంవత్సరం, పండుగల నేపథ్యంలో సంక్షేమ, మౌలిక వసతుల కోసం నిధుల ముందుగానే విడుదల చేస్తున్నట్టు పేర్కొంది.
కరోనా మహమ్మారి కారణంగా థియేటర్స్ పూర్తిగా మూసివేయడం జరిగింది. దీనితో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల వినియోగం బాగా పెరిగింది. అమెజాన్ ప్రైమ్ , నెట్ ఫ్లిక్స్ సహా అనేక ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు డిమాండ్ బాగా పెరిగింది . అయితే ఇప్పుడు ఓటీటీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది.సాధారణంగా సెన్సార్ పూర్తయిన తర్వాతే థియేటర్లలో సినిమాను ప్రదర్శిస్తారు.సినిమాలో ఏదైనా అదనపు సన్నివేశం పెడితే సెన్సార్ బోర్డు ముందు ఉంచిన తర్వాతే సిల్వర్ స్క్రీన్‌పైకి అనుమతిస్తారు. అయితే, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు…
Corona : కరోనా కొత్త వేరియంట్ JN.1 మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోంది. సింగపూర్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న కరోనా ఈ వేరియంట్ ఇప్పుడు భారతదేశంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది.
వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమాన్ని ప్రధాని మోడీ జెండా ఊపి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ క్రమంలో.. సంగారెడ్డి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూపీలో ఆరేళ్లలో 50 లక్షల మందికి ఇల్లు కట్టించాము.. కానీ తెలంగాణలో 2 లక్షల ఇల్లు కూడా కట్టలేదన్నారు. రైతులకు పెట్టుబడి సహాయం కింద 35 లక్షల మందికి ఎకరానికి 6 వేల రూపాయలు ఇస్తున్నామని తెలిపారు.
అమరావతి మాస్టర్ ప్లాన్ ఆమోదించినట్లు కేంద్రం వెల్లడించింది.. దేశంలోని 28 రాష్ట్రాల రాజధానుల జాబితాను విడుదల చేసింది కేంద్రం.. అందులో ఏపీ రాజధానిగా అమరావతికి స్థానం కలిపించింది.. పార్లమెంటు సాక్షిగా అమరావతే ఏపీ రాజధాని అని క్లారిటీ ఇచ్చింది కేంద్రం.. రాజ్యసభలో ఎంపీ జావెద్ అలీఖాన్ అడిగిన ప్రశ్నకు కేంద్రం స్పష్టమైన సమాధానం ఇచ్చింది.