Amaravati: అమరావతే ఏపీ రాజధాని.. మరోసారి స్పష్టం చేసిన కేంద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధానిపై మరోసారి కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటికే విశాఖ నుంచి పాలన ప్రారంభించేందుకు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సిద్ధం అవుతోన్న సమయంలో.. కేంద్ర ప్రకటన ఆసక్తికరంగా మారింది.. అమరావతి మాస్టర్ ప్లాన్ ఆమోదించినట్లు కేంద్రం వెల్లడించింది.. దేశంలోని 28 రాష్ట్రాల రాజధానుల జాబితాను విడుదల చేసింది కేంద్రం.. అందులో ఏపీ రాజధానిగా అమరావతికి స్థానం కలిపించింది.. పార్లమెంటు సాక్షిగా అమరావతే ఏపీ రాజధాని అని క్లారిటీ ఇచ్చింది కేంద్రం.. రాజ్యసభలో ఎంపీ జావెద్ అలీఖాన్ అడిగిన ప్రశ్నకు కేంద్రం స్పష్టమైన సమాధానం ఇచ్చింది.
Read Also: Supreetha: నేనేం అన్యాయం చేశా.. నన్నెందుకు వేధిస్తున్నారు.. సురేఖావాణి కూతురు పోస్ట్ వైరల్
Also Read
- India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్‌కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
- Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్‌లోనే..
దేశంలోని 39 శాతం రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్నది నిజమా? కాదా? అని రాజ్యసభలో ఎంపీ జావెద్ అలీఖాన్ ప్రశ్నించారు. అయితే, ఎంపీ జావెద్ అలీఖాన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ సమాధానం ఇస్తూ.. రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్న మాట అవాస్తవం అన్నారు. ఏపీ రాజధాని అమరావతితో సహా 26 రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ ఉందని పేర్కొంది కేంద్రం.. త్రిపుర రాజధాని అగర్తల, నాగాలాండ్ రాజధాని కోహిమాలు మినహా మిగతా రాజధానుల మాస్టర్ ప్లాన్ లను ఆమోదించినట్లు ఈ సందర్భంగా పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.. కాగా, చంద్రబాబు హయాంలో అమరావతిని రాజధానిగా నిర్ణయించినా.. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత మూడు రాజధానుల విధానంతో ముందుకు సాగుతున్నారు.. అందులో భాగంగా.. త్వరలోనే విశాఖ కేంద్రంగా పరిపాలన ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నారు.. అమరావతి.. శాసన రాజధానిగా.. కర్నూలు న్యాయ రాజధానిగా నిర్ణయించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
-
India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్‌కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
-
Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
-
VIJAY – TRISHA : విజయ్ – త్రిష జంటగా కనిపిస్తే ట్రోలింగ్ ఎందుకు?
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!