Vizag Steel Plant: స్టీల్‌ప్లాంట్‌కు శాశ్వత పరిష్కారం..! సెయిల్‌లో విలీనం..!
- విశాఖ స్టీల్‌ప్లాంట్ పై శాశ్వత పరిష్కారంపై కేంద్రం దృష్టి..
- ప్రైవేటీకరణకు బదులుగా.. మరో ఆప్షన్‌ను ట్రై..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి.. కేంద్రం ఏ చేయబోతోంది. ప్రైవేటీకరిస్తాం అని ఇప్పటికే చెప్పిన కేంద్రం.. ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిందా.. ప్రైవేటీకరణకు బదులుగా.. మరో ఆప్షన్‌ను ట్రై చేస్తోందా.. ఇప్పుడివే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్ మనుగడకు శాశ్వత పరిష్కారంపై కేంద్రం దృష్టిపెట్టింది. మరో ప్రభుత్వరంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్‌లో విలీనం చేస్తే ఎలా ఉంటుందా అనే కోణంలో దృష్టిపెట్టింది. అలాగే.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూములను ఎన్ఎండీసీకి విక్రయించే ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తోంది. ఇదే అంశాలపై సెయిల్‌తో పాటు.. ఎన్‌ఎండీసీ ఛైర్మన్‌లతో కేంద్రం చర్చలు జరుపుతోంది.
Read Also: Hurricane Helene : ఫ్లోరిడా, జార్జియాలో హెలెన్ హరికేన్ విధ్వంసం.. 30 మంది మృతి
Also Read
- AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
ఆర్థికంగా కష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడ సాగించాలంటే సెయిల్‌లో విలీనం చేస్తే మంచిదనే ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, సెయిల్‌లు కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ పరిధిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బదులుగా శాశ్వత పరిష్కారం కోసం ఈ రెండింటినీ విలీనం చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే.. రుణాల నుంచి బయటపడేందుకు విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు చెందిన 1500 నుంచి 2000 ఎకరాల భూములను ఎన్ఎండీసీకి విక్రయించే ప్రతిపాదనలు, బ్యాంకు రుణాల వంటి అంశాలను పరిశీలిస్తోంది. స్టీల్ ప్లాంట్ ఏపీ ప్రజల సెంటిమెంట్. దాని కోసం పెద్ద ఉద్యమమే నడిచింది. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వారి త్యాగాలతో వచ్చిన స్టీల్ ప్లాంట్‌కి మనుగడ కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొన్ని నెలలుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు గానీ.. ఏపీలో కూటమి ప్రభుత్వం దీనిపై పెద్దగా స్పందించలేదు. అయితే.. తెరవెనక చర్చలు జరుగుతున్నాయనీ, ప్రైవేటీకరణ కాకుండా ఇతర ఆప్షన్స్ చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.
తాజావార్తలు
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు