AP and Telangana: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. రెండు రాష్ట్రాల్లో రోడ్ల అభివృద్ధి కోసం నిధులు కేటాయించింది కేంద్రం.. అందులో ఆంధ్రప్రదేశ్‌కు 498 కోట్ల రూపాయలు కేటాయించగా.. తెలంగాణకి 516 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది.. ఏపీలో 200.06 కిలోమీటర్ల పొడవైన 13 రాష్ట్ర రహదారులకు కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి నుంచి నిధులు కేటాయించింది.. గుంటూరు – నల్లపాడు రైల్వే మార్గంలో శంకర్ విలాస్ ఆర్‌ఓబీ ని నాలుగు వరుసల నిర్మాణానికి 98 కోట్ల రూపాయలు కేటాయించగా.. తెలంగాణలో NH 565లోని నకిరేకల్ – నాగార్జున సాగర్ మధ్య 14 కిలోమీటర్ల పొడవు, 4-లేన్ బైపాస్ నిర్మాణానికి 516 కోట్ల రూపాయలు మంజూరు చేసింది..
Read Also: IND vs NZ: ఆ ముగ్గురు బెంచ్‌కే పరిమితం.. న్యూజిలాండ్‌తో ఆడే తొలి టెస్టు తుది జట్టిదే!
కాగా, నకిరేకల్ – నాగార్జున సాగర్ మధ్య బైపాస్ రోడ్డు నిర్మాణంతో నల్గొండ టౌన్ కి ట్రాఫిక్ రద్దీ తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు.. మరోవైపు నకిరేకల్ – నాగార్జున సాగర్ మధ్య కనెక్టివిటీ పెరగనుంది.. ఇక, ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ మధ్య కీలకమైన జాతీయ రహదారిగా ఉంది NH 565.. తెలంగాణలోని నకిరేకల్ వద్ద NH 65తో జంక్షన్ నుండి ప్రారంభమై నల్గొండ, మాచర్ల, ఎర్రగొండపాలెం కనిగిరి పట్టణాల గుండా వెళ్తుంది NH 565.. ఈ రహదారి అభివృద్ధితో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరింత మెరుగైన రవాణావ్యవస్థ అందుబాటులోకి రానుంది.. మరోవైపు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, గోవాతో సహా పలు రాష్ట్రాల్లో పలు ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేస్తున్నట్లు రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం ప్రకటించారు.
Read Also: Election Commission: నేడు జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్..
మహారాష్ట్రలో, జాతీయ రహదారి 63లో ఉద్గీర్ నుండి దేగలూరు వరకు మరియు అడంపూర్ ఫాటా నుండి సగ్రోలి ఫాటా సెక్షన్ వరకు సుగమం చేసిన భుజంతో పాటు రెండు లేన్‌ల పునరావాసం మరియు అప్‌గ్రేడేషన్ కోసం రూ.809.77 కోట్లు మంజూరు చేయబడ్డాయి. ఈ రహదారి మహారాష్ట్రలోని లాతూర్, నాందేడ్ సరిహద్దు జిల్లాలను తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాతో కలుపుతుంది. ఈ కనెక్టివిటీ ఉద్గీర్, ముక్రామాబాద్ మరియు డేగలూరు నగరాల్లో పారిశ్రామిక వ్యవసాయ-వ్యాపార కార్యకలాపాలకు ఊతం ఇస్తుంది. ఖనిజాలు అధికంగా ఉండే మరాఠ్వాడా మరియు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల మధ్య ఈ మార్గం ఒక ముఖ్యమైన లింక్‌గా ఉపయోగపడుతుంది, తద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది మరియు కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా వేస్తున్నారు..