Eatala Rajendar: తాజాగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించి పలు వ్యాఖ్యలు చేసారు. ఇందులో భాగంగా.. రీజనల్ రింగ్ రోడ్డు ప్రపోజల్ ఉన్న ప్రాంతాల్లో రైతులు, ప్రజలు ఆందోళన పడుతున్నారని, తమ పొలాలకు, స్థలాలకు వచ్చే నష్ట పరిహారం విషయంలో బాధపడుతున్నారని, రీజనల్ రింగ్ రోడ్డు బాదితుల సమస్యలను కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ దృష్టికి తీసుకవెళ్ళామని ఆయన తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డుపై సంపూర్ణ నివేదికను త్వరలోనే నితిన్ గడ్కరీకి అందిస్తామని అన్నారు.
Gnanavel Raja: వేట్టయన్ గురించి అనలేదు.. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు: కంగువా నిర్మాత
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి దృష్టికి పలు అంశాలు తీసుకవెళ్ళామని, గతంలో కేంద్రం ఇచ్చిన ఇళ్లను కట్టలేకపోయారని, ఎక్కువ డబుల్ బెడ్ రూం ఇల్లు ఇవ్వాలని కోరినట్లు.. అలాగే పేద వాళ్ళకే అందేలా విధివిధానాలు ఉండాలని కోరినట్లు ఆయన వ్యాఖ్యానించారు. ఐకమరోవైపు హైడ్రా పేరిట వేలాది ఇళ్లకు, వందలాది కాలనీలకు నోటీసులు ఇచ్చారని.. అర్బన్ ఐజేశన్ లో భాగంగా ఎన్నో చెరువులు మాయం అయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా చెరువుల్లో డ్రెయినేజీ నీళ్ళు కలిపారని, దాంతో అవి దుర్ఘంధంగా మారిపోయాయని పేర్కొన్నారు.
Maoists Funerals: ఎన్కౌంటర్ మృతులకి మావోయిస్టుల అంత్యక్రియలు
చెరువుల్లోకి వచ్చే డ్రెయిన్ లను అపాలని.. దానికి కేంద్రం సహకరించాలని, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ కు కేంద్రం నిధులు ఇవ్వాలని కోరినట్లు ఆయన అన్నారు. అలాగే రాష్ట్రానికి స్వచ్ఛ భారత్ కింద నిధులు ఇవ్వాలని కోరామని అందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్నిరకాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లకు బంగళాలు లేక.. అద్దె గదుల్లో నడుపుతున్నారని.. వాటికీ సంబంధించిన బిల్లులు ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. కనీసం పెద పిల్లలు చదివే గురుకులాలను డైట్ చార్జి లు కూడా ఇవ్వడం లేదని, డబాయింపులతో.. బెదిరింపులతో ప్రభుత్వం నడపలేదంటూ ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం కూడా ఇలాగే వ్యవహరిస్తే.. ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని.. ఉన్న స్కూళ్లను మూయొద్దని, అలాగే కొత్త భవనాలు ఇచ్చి సరిపోయేంత టీచర్లను పెట్టాలని ఆయన వ్యాఖ్యానించారు.