Jaggareddy: డాటా సరిగ్గాలేక రుణమాఫీ ఆలస్యమైంది.. దీంట్లో దాచుకునేది ఏముంది?
- హామీ ప్రకారం సీఎం రుణమాఫీ చేశాం
- ఆర్థికంగా ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నా రూ. 31 వేల కోట్ల రుణమాఫీకి తీర్మానం చేశాం
- డాటా సరిగ్గాలేక రుణమాఫీ ఆలస్యమైంది
- దీంట్లో దాచుకునేది ఏముంది?
- కేంద్ర ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు
- ముందు వాటి గురించి మాట్లాడండి
- బీజేపీ రైతు దీక్షపై జగ్గారెడ్డి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్.. రాహూల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం సీఎం రుణమాఫీ చేశారని.. ఆర్థికంగా ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నా… 31 వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి తీర్మానం చేసి… 18 వేల కోట్లు బ్యాంకుల ఖాతాలో వేశారని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. 8 నెల్లలోపే రుణమాఫీ చేశామని.. మిగిలినవి డాటా సరిగా లేక ఆలస్యం అవుతుందన్నారు. దీంట్లో దాచుకునేది ఏముంది? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఇందిరాపార్క్ దగ్గర రుణమాఫీ జరగలేదు అని దీక్ష చేశారని.. తెలంగాణలో బీజేపీకి రాజకీయంగా ఉనికి పెంచుకునే పనిలో పడిందన్నారు. బీజేపీ.. కాంగ్రెస్ మీద బురద జల్లె పనిలో పడిందని అన్నారు. తమపై విమర్శించే హక్కు బీజేపీకి లేదని విమర్శించారు.మోడీ.. ఎన్నికల సమయంలో నల్లదనం తెచ్చి ప్రతీ పేదవాడి అకౌంట్ లో వేస్తా అని చెప్పలేదా? అని ప్రశ్నించారు.
READ MORE: Sabitha Indra Reddy : కొండా సురేఖ వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి ఫైర్..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
పదేండ్లు బీజేపీ.. అధికారంలో ఉండి పేదల అకౌంట్‌లోకి చిల్లి గవ్వ అయిన వేశారా? అని ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారని.. 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండే.. చర్చకు సిద్ధంగా ఉన్నారా..? అన్ని సవాల్ విసిరారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారని.. సమాధానం ఉందా? అని ప్రశ్నించారు. ” దేశ రైతుల నడ్డి విరిచేలా నల్ల చట్టాలు తెచ్చింది నిజం కాదా..? దీక్షలు చేస్తున్న రైతులను తొక్కి చంపిన చరిత్ర మీది కాదా..? ధరలు తగ్గిస్తామని చెప్పి.. డబుల్ చేశారు నిజం కాదా..? మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు తులం బంగారం 28 వేలు.. మోడీ అధికారంలోకి వచ్చాకా.. రూ. లక్షకు తులం అయ్యింది. వీటికి తెలంగాణా బీజేపీ నేతలు సమాధానం చెప్పగలరా..? ” అని ఫైర్ అయ్యారు.
READ MORE:Israel-Iran War: ఇరాన్ భయంకరమైన తప్పు చేసింది.. ఇజ్రాయెల్ మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు
తులం బంగారం రూ. లక్ష చేసినా.. తెలంగాణలో మహిళలు 8 మంది ఎంపీలను గెలిపించారని మజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. “ఎందుకు అనే ఆలోచనే చేయలేదా ప్రజలు.. బాధ అనిపించడం లేదా..? గ్యాస్ ధర పెంచారు.. కోపం రావడం లేదా.. పెట్రోల్..డీజిల్ ధరలు పెంచినా.. కోపం రావడం లేదా..? ధరలు పెంచినా.. ఓటేస్తారు అని బీజేపీ వాళ్లకు కండ్లు నెత్తికి ఎక్కినయ్..
బీజేపీ వాళ్ళ లెక్క డ్రామాలు వేయడం రాదు. కాంగ్రెస్ నేతలు ప్రాక్టికల్ గా ఉంటాం.. బీజేపీ నేతలు నటనలో పుట్టి..నటనలో పెరిగారు” అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!