తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కాస్త ముందడుగు పడింది.. ఈ కేసులో వాచ్మన్ రంగయ్య తన స్టేట్మెంట్లో సంచలన విషయాలు బయటపెట్టారు.. అయితే, రంగయ్య వ్యాఖ్యలపై స్పందించారు వివేకానంద రెడ్డి ప్రధాన అనుచరుడు ఎర్రగంగి రెడ్డి.. అసలు వాచ్ మెన్ రంగయ్యతో నాకు పరిచయమే లేదన్న ఆయన.. నేను ఎవరిని బెదిరించలేదన్నారు… కడప, పులివెందులలో బెదిరించినట్లు నాపై కేసులు కూడా ఎక్కడా లేవు?…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీమంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పురోగతి సాధించింది.. ఈ కేసులో సుదీర్ఘ విచారణ కొనసాగిస్తున్న సీబీఐ.. వివేకానందరెడ్డి ఇంటి వాచ్మెన్ రంగయ్య నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది.. రంగయ్య తన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు.. వివేకా హత్యకు రూ. 8 కోట్లు సుపారీ ఇచ్చినట్లు తెలిపిన ఆయన.. ఈ హత్యలో తొమ్మిది మంది భాగంగా ఉన్నారని తెలిపారు. హత్య…
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సిబిఐ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో వివేకా హత్య కేసులో 39వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో ఇప్పటివరకు నిందితులు ఎవరు అన్నది తేల్చటం సిబిఐ అధికారులకు కూడా పెద్ద సమస్యగా మారింది. కాగా, ఈ కేసులో కొత్త కొత్త పేర్లు తెరమీదకు రావటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా ఎర్రగంగిరెడ్డి, అతని సోదరుడు సిద్దారెడ్డి సీబీఐ విచారణకు హాజరైనారు. మరో…
మాజీమంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఇప్పటికే పలువురిని ప్రశ్నించిన సీబీఐ తాజాగా మరికొందరి పేర్లు తెరపైకి తెచ్చింది. దీంతో కేసు దర్యాప్తు మరో మలుపు తిరుగుతోంది. మొన్నటివరకు మాజీ కారు డ్రైవర్ దస్తగిరితో పాటు కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాను పదే పదే విచారించిన అధికారులు.. తాజాగా వారితో పాటూ వివేకా ముఖ్య అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, డ్రైవర్ ప్రసాద్ ,ఉమా మహేశ్వర్ ను గత పది రోజులుగా…
అమరావతి రాజధాని భూముల కుంభకోణంలో అధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మాజీ ఐఏఎస్ సాంబశివరావు, ఐఏఎస్సులు కాంతిలాల్ దండే, కోన శశిధర్లూ అక్రమాలకు సహకరించారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంతిలాల్ దండే, కోన శశిధర్ సీఐడీ విచారణ ఎదుర్కొనే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. రికార్డులను ట్యాంపర్ చేశారని.. తుళ్లూరు మండలంలో అసైన్డ్ రికార్డులను మాయం చేశారని అధికారులపై అభియోగాలు ఉన్నాయి. read also : రూ.879 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత ఇప్పటికే సీఐడీకి…
కడప జిల్లా : వైఎస్ వివేకా హత్య కేసులో ఇవాళ 19వ రోజు సీబీఐ విచారణ కొనసాగనుంది. విచారణలో భాగంగా నిన్న పులివెందులకు చెందిన బాలుతో పాటు పులివెందులలో వివేకా ఇంటిని పరిశీలించింది సీబీఐ బృందం. ప్రస్తుతం కడప సెంట్రల్ జైల్లోని గెస్ట్ హౌస్, కడప ఆర్అండ్ బి గెస్ట్ హౌస్ కేంద్రాలుగా సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఇక ఇవాళ మరికొంత కీలక వ్యక్తులను సీబీఐ అధికారులు విచారణ చేయనున్నారు. read more : మహిళలకు శుభవార్త…
సీబీఐ, ఈడీ కోర్టులో నేడు సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. అయితే ఇందూ టెక్ జోన్ కేసులో విశ్రాంత ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసారు. ఇందూ టెక్ జోన్ ఛార్జ్ షీట్ నుంచి తనను తొలగించాలని బీపీ ఆచార్య కోరగా.. తదుపరి విచారణ నాటికి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసేందుకు సమయం కోరారు జగన్. డిశ్చార్జ్ పిటిషన్ల దాఖలుకు సమయం కోరారు విజయసాయిరెడ్డి, కార్మెల్ ఏషియా కంపెనీ. అయితే…
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన సీబీఐ విచారణ 16 వ రోజు కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో మరిన్ని వివరాలను రాబట్టేందుకు అధికారులు పలువురిని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో కొత్త వ్యక్తులు తెరపైకి వచ్చారు. ఇవాళ పులివెందుల, ఇతర ప్రాంతాల నుంచి కొందరు అనుమానితులు అధికారుల ముందు హాజరు కానున్నారు. కాగా నిన్న (సోమవారం) కూడా సీబీఐ అధికారులు కడప కేంద్ర కారాగారంలోని అతిథిగృహంలో…
వైఎస్ వివేకా హత్య కేసులో 15వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. దీంతో ఇవాళ ఈ కేసులో ఆరుగురు అనుమానితులు సీబీఐ ముందు విచారణకు హాజరయ్యారు. అటు వరుసగా 5వ రోజు సీబీఐ విచారణకు వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి హాజరయ్యారు. పులివెందులకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హాజరు కావడం విశేషం. ఎర్ర గంగిరెడ్డితో పాటు పులివెందులలో ఒకే కుటుంబానికి చెందిన దంపతులు కృష్ణయ్య, సావిత్రి, కుమారులు సునీల్ యాదవ్, కిరణ్ కుమార్…
వైయస్ వివేకా హత్య కేసులో 14వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతుంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో విచారణ జరుగుతుంది. వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి వరుసగా నాలుగో రోజు విచారణకు హాజరయ్యాడు. అయితే ఎర్ర గంగిరెడ్డితో పాటు రాఘవేంద్ర రెడ్డి, సింహాద్రిపురం నుంచి వ్యవసాయ కూలీ ఓబుల్ పతి నాయుడు, కదిరికి చెందిన కిషోర్ కుమార్ రెడ్డి, పులివెందులకు చెందిన దంపతులు కృష్ణా, సావిత్రి తో కలిపి నేడు మొత్తం ఆరు మంది…