వైఎస్ వివేకా హత్య కేసులో పదో రోజు సిబిఐ విచారణ కొనసాగుతుంది. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో సీబీఐ విచారణ జరుగుతుంది. ఈరోజు తాజాగా ముగ్గురు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు సిబిఐ అధికారులు. చిట్వేలి మండలానికి చెందిన వైకాపా కార్యకర్తలు లక్ష్మీ రంగా, రమణను ప్రశ్నిస్తున్న సిబిఐ అధికారులు… వారితో పాటు సింహాద్రిపురం మండలం సుంకేసుల గ్రామానికి చెందిన జగదీశ్వర్‌రెడ్డిని ప్రశ్నించారు సీబీఐ అధికారులు. గతంలో వివేకా దగ్గర జగదీశ్వర్ రెడ్డి పీఏగా పనిచేసాడు. అయితే చూడాలి మరి…
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. నేడు వివేకా హత్య కేసు ఆరో రోజు సీబీఐ విచారణ కొనసాగుతుంది. కడప సెంట్రల్ జైల్లోని గెస్ట్ హౌస్ కేంద్రంగా విచారణ సాగుతుంది. నిన్న వివేకా అనుచరుడు సునీల్ కుమార్ యాదవ్ తో పాటు పులివెందులలోని ఒక ఇన్నోవా వాహనం యజమాని మట్కా రవి, డ్రైవర్ గోవర్ధన్ లను సీబీఐ విచారించింది. కాగా నేడు తాజాగా నేడు మరోసారి మాజీ కారు…
నేడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో ఐదో రోజు సీబీఐ విచారణ జరుపుతుంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహాంలో విచారణ చేస్తుంది సీబీఐ అధికారుల బృందం. ఇక నిన్న వైఎస్ వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి,,కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాను 8 గంటల పాటు ప్రశ్నించారు. నేడు విచారణకు వివేకా కుమార్తె సునీత వచ్చే అవకాశం ఉంది. ఇక పులివెందులలో వైయస్ వివేకా ఇంటిని పరిశీలిస్తున్నారు సీబీఐ అధికారులు. వైఎస్ వివేకా ఇంటితో పాటు…
బ్యాంక్ రుణాల ఎగవేత కేసుల్లో దేశవ్యాప్తంగా 14 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది.. ఢిల్లీ, గుర్గావ్తో పాటు హైదరాబాద్‌లోనూ సీబీఐ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. యెస్ బ్యాంక్ నుంచి 466 కోట్ల రూపాయల రుణం తీసుకుని ఎగ్గొట్టిన ఓయిస్టర్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్, అవంత రియాల్టీ లిమిటెడ్ కంపెనీలపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఆ రెండు కంపెనీల డైరెక్టర్లు, ప్రమోటర్ల ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. నకిలీ పత్రాలతో పొందిన రుణాలను పక్కదారి పట్టించినట్లు…
కొత్త బాస్ వచ్చినప్పుడు.. తాను ఏంటో చూపించుకోవాలని అనుకుంటారు.. తన మార్క్ కనిపించాలని అనుకుంటారు.. అది పని విధానమే కావొచ్చు.. డ్రెస్ కోడే కావొచ్చు.. మరోలా కనిపించొచ్చు.. ఇప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష్ (సీబీఐ) ఈ కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.. సీబీఐ కొత్త డైరెక్టర్ ఈ మధ్యే బాధ్యతలు స్వీకరించారు సుబోధ్ కుమార్ జైస్వాల్… తాజాగా, సీబీఐలో పనిచేసే అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఇక నుంచి జీన్స్, టీషర్ట్స్, స్పోర్ట్స్…
ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈ రోజు జగన్ తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. పిటీషనర్ రాజకీయ దురుద్దేశ్యంతోనే పిటీషన్ దాఖలు చేశారని, పిటీషనర్ తన పిటీషన్లో వాడిన భాష, తీవ్ర అభ్యంతరకరంగా ఉందని పిటీషనర్ రూ.900 కోట్లు బ్యాంకులను మోసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడని కౌంటర్లో పేర్కోన్నారు.…
మంగళవారం రోజు .. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సుబోధ్ కుమార్ జైస్వాల్‌ను నియమించిన సంగతి తెలిసిందే కాగా.. ఇవాళ సుబోధ్ కుమార్ జైస్వాల్ బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగున్నారు జైస్వాల్.. మహారాష్ట్ర క్యాడర్ 1985 బ్యాచ్‌కు చెందిన ఈ ఐపీఎస్ ఆఫీసర్.. ప్రస్తుతం సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరు ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపించినా.. చివరకు ప్యానల్ సుబోధ్ కుమార్ జైస్వాల్ వైపు…
జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రఘురామ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని జగన్‌కు, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ఇప్పటికే పలుమార్లు అవకాశం ఇచ్చిన సీబీఐ కోర్టు మరోసారి అవకాశం ఇచ్చింది. జూన్ 1 వ తేదీన కౌంటర్ దాఖలు చేయాలని, 1 వ తేదీన కౌంటర్ దాఖలు చేయకుంటే నేరుగా విచారణ…
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి కొత్త బాస్ వచ్చేశాడు… 1985 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారి అయిన సుబోధ్ జైస్వాల్ సీబీఐ కొత్త డైరెక్టర్‌గా నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి ఆయన రెండు సంవత్సరాల పాటు ఈ కీలక బాధ్యతల్లో ఉండనున్నారు.. తెల్గి కుంభకోణం దర్యాప్తులో కీలక పాత్ర పోషించి ప్రసిద్ధి చెందిన జైస్వాల్.. సీబీఐ చీఫ్ వరకు ఎదిగారు.. ప్రస్తుతం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళానికి (సిఐఎస్ఎఫ్) చీఫ్ గా విధులు…
తన తండ్రి, ఎంపీ రఘురామకృష్ణరాజును అక్రమంగా అరెస్ట్ చేశారని, కస్టడీలో హింసించారని ఆయన కుమారుడు.. భరత్.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. అక్రమ అరెస్టు, కస్టడీలో పోలీసులు పెట్టిన హింసపై సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు.. అయితే ఆ రిట్ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వం, సీబీఐకి నోటీసులు జారీ చేసింది.. దీనిపై 6 వారాలలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.. ఇక, తదుపరి విచారణను ఆరు వారాలకు…