అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా పశ్చిమబెంగాల్‌లో పొలిటికల్ హీట్ మాత్రం తగ్గడం లేదు.. మంత్రులను, టీఎంసీ నేతలను సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ.. టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీతో పాటు టీఎంసీ కార్యకర్తలు సీబీఐ కార్యాలయం ముందు నిరసనకు దిగారు.. మంత్రి ఫిర్హాద్ హకీంను, ఇతర నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.. ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు సీఎం మమతా బెనర్జీ.. టీఎంసీకి చెందిన ఇద్దరు మంత్రులను సీబీఐ అరెస్ట్ చేయడంపై భగ్గుమన్న…
మంగళగిరి సిఐడి కార్యాలయమలో మూడోసారి విచారణకు మాజీమంత్రి దేవినేని ఉమా హజరయ్యారు. ఈ సందర్బంగా దేవినేని ఉమా మాట్లాడారు. రెండు రోజుల పాటు రోజుకు 9 గంటల పాటు విచారణ చేశారని..మళ్లీ మూడో రోజు విచారణకు రావాలని పిలిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వివేకానంద హత్య కేసులో విజయసాయిరెడ్డిని, సాక్షి కొమ్మినేని శ్రీనివాసరావును విచారణ జరిపితే ఈపాటికి నిజాలు తెలిసేవని.. 41 క్రింది నాకు హైకోర్టు బెనిఫిట్స్ ఇస్తే అధికారులు దాన్ని కాల రాస్తున్నారని ఫైర్…
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐకి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు లేఖ రాయడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. వివేకా హత్య సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబీవీ ఈ కేసు విచారణలో సీబీఐ అచేతనత్వంతో ఉందని.. సీబీఐ విచారణ మొదలై ఏడాది గడిచినా కేసు దర్యాప్తులో పురోగతి లేదని సీబీఐ దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే కాగా.. వివేకా హత్యకేసు సమాచారం ఉందని సీబీఐకి రెండుసార్లు తెలిపానని.. అయినా స్పందించలేదని పేర్కొన్నారు..…