వైఎస్ వివేకా హత్య కేసు.. ఆయుధాల అన్వేషణకు బ్రేక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాల అన్వేషణకు బ్రేక్ పడింది… తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకూ ఆయుధాల కోసం తవ్వకాలు నిలిపివేయాలంటూ మున్సిపల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది సీబీఐ… దీంతో, రోటరీపురం, గరండాల వాగు వద్ద తవ్వకాలు నిలిపివేశారు.. బారికేడ్లు తొలగించి పోలీసుల పికేటింగ్‌ను ఎత్తేశారు అధికారులు.. ఇక, ఆ రహదారి గుండా యథావిథిగా ప్రయాణించేందుకు అనుమతి ఇస్తున్నారు.. కాగా, మూడు రోజుల పాటు తవ్వకాలు చేసినా ఆయుధాలు లభించలేదు.. మురికి నీటిని తొలగించి జెసీబీ యంత్రాల సహాయంతో వ్యర్థపు మట్టిని తొలగిస్తూ అన్వేషణ సాగింది.. మున్సిపల్ సిబ్బంది, 26 మంది తీవ్రంగా శ్రమించినా ఆయుధాల జాడ కనిపించలేదు.
మరోవైపు.. పులివెందుల కేంద్రంగా వైఎస్ వివేకా కేసులో సీబీఐ అధికారుల విచారణ కొనసాగుతోంది.. మరోమారు పలువురు అనుమానితులను విచారించే అవకాశం కనిపిస్తోంది.. కస్టడిలో ఉన్న సునీల్ ఇచ్చిన ఆయుధాల సమాచారంతో సందిగ్ధంలో పడ్డ సీబీఐ అధికారులు.. మరోమారు ఆయుధాల సమాచారంపై విచారించే అవకాశం కనిపిస్తోంది.. ఇక, నిన్న తవ్వకాలను పరిశీలించిన ఆయుధాల అన్వేషణపై ఆరా తీశారు వివేకా కుమార్తె సునీత.. పులివెందుల ఆర్ అండ్ బీ అతిథి గృహంలో సీబీఐ అధికారులను కలిసి కేసు పురోగతిపై కూడా ఆమె ఆరా తీశారు.. నిన్న ఎనిమిది మంది అనుమానితులను ప్రశ్నించింది సీబీఐ.. కోడిగుడ్ల వ్యాపారి సంపత్, ఎర్రంరెడ్డిపల్లెకు చెందిన జగదీష్ రెడ్డి, యుసీఐఎల్ ఉద్యోగి ఉదయ్ కుమార్ రెడ్డి, పార్మసిస్ట్ మణి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ లతో పాటు సిఎస్ఐ చర్చి సిబ్బందిని కూడా విచారించారు సీబీఐ అధికారులు.
Also Read
- Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
- UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
- Sonam Wangchuk: సోనం వాంగ్‌చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
- Supreme Court: ‘సర్’లో పేరు లేకపోతే పౌరసత్వం లేనట్టేనా.. సంక్షేమ పథకాలు నిలిపేస్తారా? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్‌బ్రష్‌తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
-
Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
-
Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?