Manipur Violence Cases: 53 మందితో సీబీఐ దర్యాప్తు బృందం.. 29 మంది మహిళా అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Earthquake : మణిపూర్‌లో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుతో కేంద్రప్రభుత్వం సీబీఐతో విచారణకు ఆదేశించిన విషయం తెలిసింది. అందులో భాగంగా సీబీఐ బృందంలో 53 మంది సభ్యులను నియమించారు. వారిలో 29 మంది మహిళా అధికారులు ఉండటం విశేషం. సీబీఐ విచారణ బృందంలో ఇంత పెద్దమొత్తంలో మహిళా అధికారులు ఉండటం ఇదే మొదటిసారని.. గతంలో ఏ కమిటీ విచారణ సందర్భంగా కూడా ఇంత మంది మహిళా అధికారులు లేరని చెబుతున్నారు. మణిపూర్ అల్లర్లలో వెలుగుచూసిన లైంగిక హింస వీడియో కేసును సీబీఐకి కేంద్రం అప్పగించిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారించడానికి సీబీఐ దేశవ్యాప్తంగా ఉన్న యూనిట్ల నుంచి 53 మంది అధికారులను నియమించింది. అందులో 29 మంది మహిళా అధికారులు ఉన్నారు. ముగ్గురు డీఐజీలు లవ్లీ కతియార్, నిర్మలాదేవి, మోహిత్ గుప్తాతోపాటు ఒక ఎస్పీ రాజ్‌వీర్ సైతం ఉన్నారు. ఇద్దరు అదనపు పోలీసు సూపరింటెండెంట్లు, ఆరుగురు డిప్యూటీ సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్‌లు సీబీఐ బృందంలో ఉన్నారు. మొత్తం దర్యాప్తును జాయింట్ డైరెక్టర్ ఘనశ్యామ్ ఉపాధ్యాయ్ లీడ్ చేయనున్నారు.
Read also: TS Govt : రాష్ట్రం లో 5500 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేసే ఆలోచనలో వున్న ప్రభుత్వం..?
Also Read
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
- Mohan Bhagwat: ‘భారత్‌లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
సీబీఐ విచారిస్తున్న ఈ కేసుల్లో చాలా వరకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం, 1989లోని నిబంధనలకు సంబంధించినవని, వాటిని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారి దర్యాప్తు చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అలాంటి కేసుల్లో డీఎస్పీలు పర్యవేక్షకులుగా ఉండటం సాధ్యం కానందున దర్యాప్తును పర్యవేక్షించడానికి సీబీఐ ముగ్గురు డీఐజీలను ఒక ఎస్పీని నియమించినట్లు అధికారులు స్పష్టం చేశారు. సీబీఐ బృందంలో 16 మంది ఇన్‌స్పెక్టర్లు, 10 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు కూడా ఉంటారని అధికారులు తెలిపారు. సాధారణంగా ఇంత పెద్ద సంఖ్యలో కేసులను సీబీఐకి అప్పగించాల్సి వస్తే సిబ్బందిని సమకూర్చేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సంబంధిత రాష్ట్రంపై ఆధారపడి ఉంటుందని, కానీ మణిపూర్ విషయంలో దర్యాప్తులో పక్షపాత ఆరోపణలు రాకుండా స్థానిక అధికారుల పాత్రను తగ్గించడానికి సీబీఐ ప్రయత్నిస్తున్నట్టు అధికారులు చెప్పారు. విచారణ సందర్బంగా ఇరు వర్గాల వ్యక్తుల ప్రమేయం ఉండకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే సీబీఐ ఎనిమిది కేసులు నమోదు చేసింది. రెండు కేసుల్లో మే 4న ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసుకు సంబంధించినవి కాగా.. మణిపూర్ హింసాకాండకు సంబంధించి మరో తొమ్మిది కేసులను దర్యాప్తు చేసేందుకు సీబీఐ సిద్ధమైంది. దీంతో సంస్థ విచారించనున్న మొత్తం కేసుల సంఖ్య 17కు చేరింది.ఈ కేసులో కాకుండా మహిళలపై నేరాలు, లైంగిక వేధింపులకు సంబంధించిన ఇతర కేసులను కూడా ప్రాధాన్యత ఆధారంగా విచారిస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో చురచంద్‌పూర్ జిల్లాలో జరిగిన లైంగిక వేధింపుల కేసును కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ స్వీకరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
-
Asia Cup 2026: పాకిస్థాన్‌తో హ్యాండ్‌షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
-
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్‌లో షూటింగ్
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!