Vishal appearing before CBI in CBFC Case: కోలీవుడ్ స్టార్, హీరో విశాల్ ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రంగంలోకి దిగిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో విశాల్ హీరోగా నటించిన మార్క్ ఆంటోనీ సినిమా హిందీ సెన్సార్ సమయంలో తన దగ్గర లంచం అడిగినట్టు ఆయన ఆరోపించారు. నేను చేసిన సినిమా మార్క్ ఆంటోనీ హిందీ వర్షన్ కోసం సీబీఎఫ్‌సీ (సెంట్రల్ బోర్ట్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్)కి రూ. 6.5 లక్షలు చెల్లించాల్సి వచ్చింది, దీనికి సంబంధించిన 2 లావాదేవీలు చేశా అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. ఒకటి స్క్రీనింగ్ కోసం రూ.3 లక్షలు, రెండు సర్టిఫికెట్ కోసం 3.5 లక్షలు చెల్లించా, నా కెరీర్‌లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు, దీనిపై చర్యలు తీసుకోండి అని అంటూ విశాల్ కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన సీబీఐ ముంబై సెన్సార్ బోర్డుపై కేసు నమోదు చేసింది.
Malla Reddy: మల్లారెడ్డి మాటలకు హర్టయిన బాలీవుడ్?
తన మూవీ మార్క్ ఆంటోనీ హిందీ హక్కుల కోసం ముంబయిలోని సెన్సార్ బోర్డుకు(సీబీఎఫ్‌సీ) రూ.6.5 లక్షలు లంచం చెల్లించినట్లు విశాల్ ఓ వీడియో రిలీజ్ చేయగా దానిని బట్టి విశాల్ చేసిన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ అధికారులు అక్టోబర్ మొదటి వారంలో కేసు నమోదు చేశారు. విశాల్ ఆరోపణల ఆధారంగా.. ముగ్గురు మధ్యవర్తులతో పాటు ముంబై సీబీఎఫ్‌సీకి చెందిన సభ్యులు, మరికొందరిపైనా విచారణ చేపట్టనున్నట్లు అప్పట్లో ప్రచారం కూడా జరిగినా ఆ తరువాత ఈ వ్యవహారం సద్దుమణిగింది. ఇక ఇప్పుడు విశాల్ తనకు సీబీఐ నుంచి పిలుపు వచ్చినట్టు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు నేను CBFC కేసుకు సంబంధించి విచారణ కోసం ముంబైలోని CBI కార్యాలయానికి వెళుతున్నాను, నా జీవితంలో ఈ ఆఫీసుకి వెళ్తానని ఎప్పుడూ అనుకోలేదు అంటూ విశాల్ తన సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ లో వెల్లడించాడు. ఇక విశాల్ తన 34వ సినిమాతో ప్రేక్షకుల ఉండును వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.
Now on my way to CBI office in Mumbai for an enquiry regarding the CBFC case. Lol. Never ever thought I will be going to this office too in my life.
— Vishal (@VishalKOfficial) November 28, 2023